Baby: కుర్రాళ్లే హిట్ చేస్తున్నారు…

బేబీ సినిమా ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మైక్ పట్టుకున్న ప్రతిసారి కల్ట్ మూవీ తీసాం అంటూ చెప్పగా సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురయ్యాడు. కానీ బేబీ మూవీ కలెక్షన్స్ చూస్తుంటే ఆయన మాట్లాడిన మాటలే నిజం అయ్యేలాగా ఉన్నాయి. దాదాపు మూడు సంవత్సరాల తరువాత ఎన్నో వాయిదాల తరువాత జులై 14న రిలీజైన బేబీ సినిమా ప్రస్తుతం థియేటర్స్ లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. గతంలో హృదయ కాలేయం, కొబ్బరి మట్ట, కలర్ ఫోటో వంటి సినిమాలను తీసిన ఈ దర్శకుడు, ఒక మంచి డైరెక్టర్ గా తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే కసితో ఈ సినిమాను తెరకెక్కించాడు. మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్కెఎన్ ఈ సినిమాను నిర్మించారు.

ముందునుంచే బేబీ సినిమా పాటల ద్వారా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించింది. దానికి తోడు ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాడని మూవీ టీం కూడా బాగా కష్టపడింది. అయితే ఇప్పుడు బేబీ సినిమా కలెక్షన్స్ చూస్తుంటే ఈ మూవీ టీం కష్టం ఫలించిందని చెప్పాలి. రిలీజై కేవలం మూడు రోజులే అవుతున్న అప్పుడే ప్రాఫిట్స్ జోన్ లోకి వెళ్ళిపోయింది.

- Advertisement -

సినిమా రిలీజ్ కు ముందే దాదాపు 50 పెయిడ్ ప్రీమియర్ షోలు వేసిన కూడా మొదటి రెండు రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి , మూడో రోజుకు ప్రాఫిట్స్ లోకి చేరుకుంది. రిలీజైన మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 23.5 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. కేవలం నైజం ఏరియాలోనే ఈ సినిమా ఇప్పటి వరుకు 4కోట్ల షేర్ ను రాబట్టి డిస్టిబ్యూటర్ లలో సంతోషాన్ని నింపింది.

ఇదే ఫ్లో ఇంకో వారం రోజులు గనక కంటిన్యూ అయితే ప్రొడ్యూసర్ ఎస్కెఎన్ సినిమా ప్రమోషన్స్ లో చెప్పినట్టు బేబీ సినిమా నిజంగానే చిన్న సినిమా కలెక్షన్స్ లో కల్ట్ సినిమా అవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజానికి ఈ చిత్రానికి మొదట్లో మిశ్రమ స్పందన వచ్చింది. కానీ, తర్వాత కాలేజీలు స్టార్ అవ్వడం, స్టూడేంట్స్ థియేటర్ లకు రావడం వల్ల కలెక్షన్లు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొత్తంగా ఈ చిత్రాన్ని కుర్రాళ్లే హిట్ చేస్తున్నారని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు