Pawan kalyan: ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చేసింది బ్రో..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ కలయికలో వస్తోన్న బ్రో సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ డేట్ వచ్చేసింది. తమిళ్ యాక్టర్ సముద్రకని డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా రిలీజవ్వబోతుంది. త్రివిక్రమ్ రచన సహకారం అందిస్తున్న ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్స్ గా నటించారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో కాలాన్ని కంట్రోల్ చేసే దేవుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఇటివలనే షూటింగ్ కంప్లిట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకుంటుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ కేవలం ఇంకా 10 రోజులు ఉండటంతో సినిమా ప్రమోషన్ స్టార్ట్ చేయబోతున్నారు బ్రో సినిమా మేకర్స్. ఇటీవలనే రిలీజ్ చేసిన బ్రో సినిమా పాటలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోకపోవడంతో అందరు సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారు.

- Advertisement -

పవన్ కళ్యాణ్ సినిమా గురించి మాట్లాడితే తప్ప ప్రేక్షకులు సినిమా చూడటానికి థియేటర్ల వరకు వచ్చేలా లేరని గ్రహించిన మూవీ టీం, హైద్రాబాద్ లో భారీ సెట్ అప్ తో ఈ నెల 25న ప్రి రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేయడానికి సన్నాహాలు చేస్తునట్టు సమాచారం . ఇప్పటికే రెండు మూడు ప్లేసెస్ ను సెలెక్ట్ చేసుకున్న వీళ్ళు పవన్ కళ్యాణ్ కన్ఫర్మేషన్ తీసుకొని ప్రి రిలీజ్ జరిగే ప్లేస్ ను ఫైనల్ చేయనున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు