Pawan kalyan: హరి హర వీరమల్లు చుట్టూ కన్ఫ్యూజన్- క్లారిటీ ఇచ్చిన నిధి అగర్వాల్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదలైన హరి హర వీర మల్లు సినిమాపై అటు మేకర్స్ లో, ఇటు ఆడియెన్స్ లో అందరిలోనూ చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. అసలు ఈ సినిమా షూటింగ్ ఉంటుందో, ఇకపై ఉండదో అని అందరు అనుకుంటుండగా ఈ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ సినిమాపై చేసిన లేటెస్ట్ కామెంట్స్ ఫ్యాన్స్ లో మళ్ళీ ఈ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్నిటిలో హరిహర వీరమల్లు సినిమానే ముందుగా షూటింగ్ మొదలైంది. హుటా హుటిన మొదటి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసిన డైరెక్టర్ క్రిష్, ఈ సినిమాకు సంబంధించి ఆ మధ్య గ్లిమ్స్ వీడియో కూడా రిలీజ్ చేసారు. ఇక ఆ వీడియోతో ప్రేక్షకుల దగ్గరికి నుంచి కూడా ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. కానీ తరువాత నుంచి మాత్రం ఈ సినిమా పోకడ నత్త నడకన సాగుతుంది.

హరి హర వీర మల్లు సినిమా కంటే ఆలస్యంగా స్టార్ట్ అయిన, ఓజి సినిమా ఆల్రెడీ 50% షూటింగ్ కంప్లిట్ చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా, ఇక పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ తో చేస్తున్న బ్రో సినిమా ఐతే ఏకంగా ఈనెల 28న రిలీజ్ కు కూడా రెడీ గా ఉంది.

- Advertisement -

అయితే ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా ఇకపై ఉండదు అని అంత మాట్లాడుకుంటుండగా, ఇటీవలనే ప్రొడ్యూసర్ ఏఏం రత్నం ఎట్టి పరిస్థితుల్లో సినిమా కంప్లిట్ చేసి తీరతామని, ఈ ఇయర్ కాకపోతే వచ్చే సంవత్సరమైన తీస్తామని ఆయన మాటా ఇవ్వగా, లేటెస్ట్ నిధి అగర్వాల్ కూడా హరిహర వీరమల్లు ఫ్యాన్స్ ఉత్సాహపరిచేల ఈ సినిమాపై ఒక పోస్ట్ చేసింది. ఇటీవలనే ఇంస్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసిన పవన్ కళ్యాణ్ తన మొదటి పోస్ట్ గా ఇండస్ట్రీలో తనకు సన్నీహితులైన అందరు ఫొటోస్ ను ఆయన ఒక వీడియో ద్వారా షేర్ చేసాడు.

అయితే ఆ వీడియోలో హరి హర వీరమల్లు సినిమాకి సంబంధించి నిధి అగర్వాల్ తో కలిసి ఉన్న ఒక ఫోటో ఉండగా, ఆ ఫోటోను నిధి షేర్ చేస్తూ ఆమె సినిమా గురించి మాట్లాడుతూ

“పవర్ స్టార్ @pawankalyan sir, @dirkrish sir మరియు #AMRathnam sirతో కలిసి రాబోయే చిత్రం #HariHaraVeeraMalluలో ఎపిక్ జర్నీలో భాగమైనందుకు కృతజ్ఞతలు. 🎬
అటువంటి అద్భుతమైన బృందంతో కలిసి పనిచేయడం ఒక సంపూర్ణ ఆశీర్వాదం. నన్ను నమ్మండి, మీరందరూ త్వరలో అద్భుతమైన సినిమాని చూడబోతున్నారు”

ఇక  ఈ పోస్ట్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో మళ్ళీ హరి హర వీరమల్లు సినిమాపై అంచనాలు పెరిగాయని చెప్పవచ్చు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు