Kisi Ka Bhai Kisi Ki Jaan: సల్లూ భాయ్ స్టైల్ లో..

సల్మాన్ ఖాన్ లేటెస్ట్ గా నటించిన మూవీ ‘కిసి కా భాయ్ కిసీ కా జాన్’. సల్మాన్ ఖాన్ సొంత ప్రొడక్షన్ అయిన ‘సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్’ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ సీరీస్ ఇంకా రీసెంట్ గా బచ్చన్ పాండే సినిమా తీసిన దర్శకుడు ఫర్హద్ సమ్జీ ఈ సినిమా ను డైరెక్ట్ చేశారు. తమిళం లో వచ్చిన అజిత్ వీరం సినిమా కి ఇది రీమేక్. దీన్నే తెలుగు లో పవన్ కళ్యాణ్ కాటమ రాయుడు పేరు తో తీశారు.

కిసి కా భాయ్ కిసి కా జాన్ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటించగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. విక్టరీ వెంకటేష్ ఈ సినిమా లో ప్రత్యేక పాత్రలో నటించారు. ఇంకా జగపతి బాబు ఈ సినిమాలో విలన్ గా నటించగా, భూమిక,అభిమన్యు సింగ్,విజేందర్ సింగ్,రాఘవ్ జూయల్,సిద్ధార్థ్ నిగమ్, హిమన్షి ఖురాన తదితరులు నటించారు.

రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాలోని ఏంటమ్మా సాంగ్ ఎంత పెద్ద హిట్టయ్యిందో తెలిసిందే. ఈ పాటలో సల్లు భాయ్,వెంకటేష్ కలిసి స్తెప్పులేయగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ పాటలో స్పెషల్ అపియరెన్స్ ఇచ్చాడు.

- Advertisement -

ఇక ఏప్రిల్ 10 న 6.36 నిమిషాలకు ‘కిసి కా భాయ్ కిసీ కా జాన్’ మూవీ యొక్క అఫిషియల్ ట్రెయిలర్ విడుదలైంది. పూర్తిగా సల్మాన్ ఖాన్ మార్క్ స్టైల్ లో ఉన్న ఈ ట్రైలర్ భారీ తారాగణం తో నిండి ఉంది. సల్మాన్ ఖాన్ లుక్స్ కూడా గత చిత్రాల కంటే భిన్నంగా ఉంది. ఈ ట్రైలర్ లో అక్కడక్కడా తెలుగు పదాలు కూడా వినబడతాయి. అయితే వెంకటేష్ రోల్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంది. విలన్ గా జగపతిబాబు స్టైలిష్ గా ఉన్నాడు. సల్మాన్ ఖాన్ గత చిత్రాలు దబాంగ్ 3, భారత్, రాధే చిత్రాలు తీవ్రంగా నిరశపరచడంతో ఈ సినిమా పై చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు సల్మాన్ ఫ్యాన్స్. అనుకున్నట్టు గానే ట్రెయిలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. కానీ రీసెంట్ గా బాలీవుడ్ లో దృశ్యం 2 తప్ప ఏ రీమేక్ సినిమా కూడా ఆడలేదు. మరి ఈ రీమేక్ సినిమా బాలీవుడ్ పై ఏం ప్రభావం చూపుతుందో చూడాలి.

కిసి కా భాయ్ కిసీ కా జాన్ సినిమాను ఏప్రిల్ 21 న రంజాన్ కానుక గా విడుదల చేస్తున్నారు. సల్మాన్ కి ఈద్ సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్,వాంటెడ్,ఎక్ థా టైగర్, భజరంగి భాయ్ జాన్, సుల్తాన్ సినిమాలు రంజాన్ కానుక గా వచ్చి సూపర్ హిట్టయ్యాయి. కాబట్టి ఈ సారి ఈ సెంటిమెంట్ తో వస్తున్నాడు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు