అనుపమ పరమేశ్వరన్ పేరుకి మలయాళ అమ్మాయి అయినా మన తెలుగు వాళ్ళకి బాగా కనెక్ట్ అయింది. అనుపమకి మన కుర్రాళ్ళు ” ఉప్మా ” అని ముద్దు పేరు కూడా పెట్టుకున్నారు. తన అందం, నటనతో మాత్రమే కాకుండా తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ లతో అందరినీ ఆకట్టుకుంటుంది అనుపమ. అయితే ఈ మధ్యే ఈ భామ హీరోయిన్ గా మాత్రమే కాకుండా, కెమెరాఉమెన్ గా కూడా అవతారమెత్తింది.
“స్టడీస్ కోసమని ఒక కుర్రాడు విదేశాలకి వెళ్తాడు. వెళ్ళాక అక్కడ ఉండే కల్చర్ కి బాగా అలవాటు అయి, ఫ్యామిలీకి టైం ఇవ్వడు. అమ్మతో ఎప్పుడు కాల్ చేసిన మాట్లాడతాడు గాని తండ్రి అంటే మాత్రం అస్సలు పడదు. తండ్రి ఎప్పుడు కాల్ చేసిన అవాయిడ్ చేస్తుంటాడు. అయితే ఒకరోజు అనుకోకుండా వాళ్ళ మదర్ చనిపోతుంది. వెంటనే బయల్దేరి రమ్మని వాళ్ళ నాన్న ఆ అబ్బాయికి కాల్ చేస్తే, ఇప్పుడు రాలేను అని చెప్తాడు. దాంతో వాళ్ళ నాన్న కొడుకు మీద ఇంకా కోపం పెంచుకుంటాడు. అలాగే రోజు కాల్ చేసే వాళ్ళ అమ్మ కాల్స్ లేకపోయేసరికి తల్లిని కూడా బాగా మిస్ అవుతుంటాడు. ఈ విషయం తెలిసిన ఫ్రెండ్స్ అంత నాన్నని బాగా చేసుకోరా అని చెప్పడంతో, కొడుకుకి అర్థమవుతుంది తన కంటే ఎంజాయ్ చేయడానికి ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ నాన్న కి అమ్మ తప్ప ఎవరు లేరు అని వెంటనే రియలైజ్ అయి, తండ్రికి కాల్ చేసి కాసేపు మాట్లాడి ఒక కాఫీ తాగి, ఐ మిస్ యు అని చెప్పుకుంటారు. తండ్రి కొడుకులు ఒకరికొకరు అన్యోయంగా మాట్లాడుకోవడంతో వీడియో అయిపోతుంది”
Read More: మరో వైవిధ్యమైన పాత్రలో
అయితే ఇది ఒక షార్ట్ ఫిలిం. ఫ్యామిలీ కి టైం ఇవ్వాలి అనే లైన్ తో దీన్ని తీశారు. వీడియో కాల్స్ తోనే మొత్తం కథ జరుగుతుంటుంది. ఛాయ్ బిస్కెట్ యూట్యూడ్ ఛానల్ లో దీన్ని నిన్న రాత్రి రిలీజ్ చేసారు. ఈ షార్ట్ ఫిలిం కి అనుపమనే సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించింది. గతంలో కూడా అనుపమ ఫ్రీడమ్ ఎట్ ది మిడ్నైట్ అనే షాట్స్ ఫిలింలో నటించింది. ఒక పక్క సినిమాలు, తీరిక టైం లో ఇలా షాట్స్ ఫిలిమ్స్ చేస్తూ ఆక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దు గుమ్మ. ప్రస్తుతం అనుపమ తెలుగులో సిద్దు జొన్నలగడ్డ సరసన “డీజే టిల్లు పార్ట్ -2 ” లో నటిస్తుంది. సితార ఎంటెర్టైనెంట్స్ బ్యానర్ లో నాగ వంశి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. డీజే టిల్లు పెద్ద హిట్ అవడంతో పార్ట్ -2 పై మంచి అంచనాలు ఉన్నాయి.
For More Updates :
Read More: Renu Desai : 18 ఏళ్ల తర్వాత..
Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...