RC15 : టైటిల్ కు ముహుర్తం ఫిక్స్

ప్రముఖ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య ప్లాప్ అవడంతో చరణ్ నుంచి సాలిడ్ హిట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఆర్సి15 మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందా? ఎప్పుడు చూసేద్దామా? అని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తుండగా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయినట్లు తెలుస్తోంది.

మరికొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించాల్సి ఉన్నట్టు సమాచారం. అయితే, ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీంతో టైటిల్, ఫస్ట్ లుక్ కోసం వారు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం మార్చి 27న రామ్ చరణ్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సినిమా టైటిల్ ను అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారని సమాచారం.

ఈ చిత్రానికి సిటిజన్, అధికారి, సర్కారోడు, విశ్వంభర వంటి టైటిల్స్ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఏదో ఒక టైటిల్ ను ఖరారు చేయొచ్చని సమాచారం. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. కాగా ప్రస్తుతం దర్శకుడు శంకర్, ఇండియన్ 2 సినిమా కూడా చేస్తున్నాడు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు