Raveena Tandon: “కే.జి.ఎఫ్ 3” షూటింగ్ పై బిగ్ అప్డేట్

రాకింగ్ స్టార్ యష్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన కేజిఎఫ్ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాతో పాన్ ఇండియా హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు కన్నడ హీరో యష్. ఈ చిత్రం యష్ తో పాటు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు, హోం భలే ఫిలిమ్స్ బ్యానర్ కు కూడా మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది.

ఈ క్రేజీ కాంబినేషన్ లో అదే మాస్ ఎనర్జీని కొనసాగిస్తూ తెరకెక్కించిన కేజిఎఫ్ 2 కూడా మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసింది. అయితే రెండు భాగాలు ప్రేక్షకులలో సృష్టించిన మేనియా.. వారి మైండ్ నుంచి తొలగిపోవడం లేదు. దీంతో ఇప్పుడు మూడో భాగం కోసం ఎదురుచూస్తున్నారు.

కానీ మూడవ భాగం ఉంటుందా? ఉండదా? తెలియని సందిగ్ధంలో ఉన్నారు. నిజానికి కేజిఎఫ్ 3 గురించి డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. సెకండ్ పార్ట్ ఎండింగ్ లో హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి అభిమానులు 3 పార్ట్ అప్ డేట్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నారు. అయితే తాజాగా కేజిఎఫ్ 2 లో కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ నటి రవీనా టాండన్ కేజిఎఫ్ 3 గురించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

- Advertisement -

ఈ ఏడాది కేజిఎఫ్ 3 షూటింగ్ మొదలు కాకపోవచ్చు అని తెలిపింది. అయితే నిర్మాతలు మాత్రం కేజిఎఫ్ – 5 వరకు సినిమాను పొడగించాలని అనుకుంటున్నట్లు తెలిపింది. దీంతో ఈ కొత్త అప్డేట్ తెలిసిన అభిమానులు ఖుష్ అవుతున్నారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్ హీరోగా చేస్తున్న సలార్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు