ఇటీవల మాస్ మహారాజ రవితేజ నుంచి వచ్చిన సినిమాలు ‘ధమాకా‘, ‘వాల్తేరు వీరయ్య‘. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులని బాగా ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. ఈ రెండు సినిమాలలో రవి తేజ ఎనర్జీ తో ఫ్యాన్స్ ను ఇంప్రెస్స్ చేసాడు. ఇక ఈ మాస్ హీరో అప్ కమింగ్ సినిమా అప్డేట్స్ కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం రవి తేజ సుధీర్ వర్మ దర్శకత్వంలో ”రావణాసుర” అనే సినిమా లో నటిస్తున్నాడన్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి అప్డేట్స్ రాక చాలా కాలం అవుతుంది. దీంతో ఈ చిత్రం నుంచి అప్డేట్స్ కావాలని మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్ గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా రవి తేజ పుట్టిన రోజు సందర్భంగా జనవరి 26న రావణాసుర నుంచి అప్డేట్ ఇస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. జనవరి 26 న ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ ను విడుదల చేయనున్నారు.
ఏప్రిల్ 7, 2023 న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించబడిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్, పూజిత పొన్నాడ, దక్షా నాగర్కర్, ఫరియా అబ్దుల్లా మరియు మేఘా ఆకాష్ లు లేడీ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహతా తదితరులు సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.
అభిషేక్ పిక్చర్స్ మరియు ఆర్.టి టీంవర్క్స్ కలిసి నిర్మించిన ఈ సినిమాలో సుశాంత్ ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. హర్షవర్దన్ రామేశ్వర్ మరియు భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతాన్ని అందింస్తున్నారు.
Get ready for a special treat on MASS MAHARAJA @RaviTeja_offl birthday😎
A Glimpse of #Ravanasura On JAN 26th 2023 🔥
Stay Tuned ❤️🔥@iamSushanthA @sudheerkvarma @RTTeamWorks @SrikanthVissa @rameemusic #BheemsCeciroleo @RavanasuraMovie @AbhishekPicture pic.twitter.com/fWD6gBhOHX
— RT Team Works (@RTTeamWorks) January 24, 2023
For More Updates :
Grab Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News.