Pushpa 2 : పుష్ప 2 సినిమాలో ఆ హీరో వైఫ్ ?

Pushpa 2 : టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇండస్ట్రీలో మెగా కుటుంబాన్ని అలాగే తన అల్లు కుటుంబాల అండదండలతో ఇండస్ట్రీలో ఎదిగిపోయాడు. అయితే కెరీర్ ప్రారంభంలో బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోగా మారిపోయాడు అల్లు అర్జున్. ఈ తరుణంలోని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గా మారిపోయాడు.

పుష్ప సినిమాతో స్టార్ డం

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ మరియు దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో పుష్ప సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ తీసేసిన తర్వాత రిలీజ్ అయిన పుష్ప సినిమా బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందాన్నా నటించింది. అలాగే సునీల్, అనసూయ లాంటి వారు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ఆధారంగా పుష్ప సినిమా వచ్చింది. మొదటి చెప్పినట్లుగానే రెండు భాగాల్లో పుష్ప సినిమా చేస్తున్నారు.

ఇక మొదటి భాగం పుష్ప సినిమా బంపర్ హిట్ కావడంతో రెండవ పార్ట్ కూడా అదే స్థాయిలో పూర్తి చేస్తున్నారు దర్శకుడు సుకుమార్. అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న పుష్ప రెండవ భాగం సినిమా నుంచి కొన్ని ఫోటోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. మొన్నటి వరకు అల్లు అర్జున్ కు సంబంధించిన ఫోటోలు వైరల్ కాగా… తాజాగా రష్మిక మందాన్న ఫోటో వైరల్ అయింది.

- Advertisement -

 

Rashmika looks leaked in Pushpa 2 movie
Rashmika looks leaked in Pushpa 2 movie

ఎర్రటి చీర కట్టుకొని ఒంటినిండా నగలు వేసుకొని సాంప్రదాయ పద్ధతిలో కనిపించింది హీరోయిన్ రష్మిక మందాన. అయితే అల్లు అర్జున్ భార్యా స్నేహ రెడ్డి ఓ ఫంక్షన్ లో అచ్చం అలాగే కనిపించిందట. అక్కడ స్నేహ రెడ్డి ని చూసిన దర్శకుడు సుకుమార్.. అదే తరహాలో రష్మిక మందానను కూడా రెడీ చేశాడట. పుష్ప రెండవ భాగంలో అదే గెటప్లో రష్మిక మందాన కనిపిస్తుందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు