Mohan Babu: మోహన్ బాబు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సూపర్ వుమెన్..!

నటిగా భారీ క్రేజ్ అందుకున్న లిరీష గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వకీల్ సాబ్, బేబీ వంటి చిత్రాలతో భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాలో పవన్ కళ్యాణ్ సూపర్ వుమెన్ అంటూ ర్యాగింగ్ చేసే సీన్ తో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మోహన్ బాబు గురించి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఇంటర్వ్యూలో లిరీష మాట్లాడుతూ..

ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. గతంలో నేను అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆలీ సహాయంతో పొలిటికల్ రౌడీ సినిమాలో అవకాశం లభించింది..అందులో ఛార్మీ స్నేహితురాలి పాత్ర నాది.. అక్కడ నా లుక్ చూస్తే చాలా కామెడీగా ఉంటుంది.. ఇక ఒక సీను షూటింగ్లో భాగంగా ప్రకాష్ రాజ్ నన్ను తోస్తే నేను క్రింద పడాలి.. సినిమా షూటింగ్ జరుగుతోంది.. ప్రకాష్ రాజ్ తోసినా.. నేను కింద పడడం లేదు.. అప్పుడు మోహన్ బాబు వెనుక నుండి వచ్చి నన్ను తోసేసారు.. నేను క్రింద పడ్డాను. షూట్ ఓకే అయింది.. కానీ నేను కింద పడిపోవడంతో రాళ్లు తగిలి నా చేతులకు దెబ్బలు కూడా తగిలాయి.. అప్పుడే మోహన్ బాబు ఆయింట్మెంట్ తెచ్చి నాకు ఫస్ట్ ఎయిడ్ చేశారు.. అలాగే సీన్ ఎలా చేయాలో కూడా వివరించారు.

- Advertisement -

మోహన్ బాబు వ్యక్తిత్వం పై లిరీష కామెంట్స్..

మోహన్ బాబు వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ మోహన్ బాబు మంచి మనసున్న వ్యక్తి.. అయితే ఆయన కొన్ని కండిషన్స్ పెట్టుకుంటారు. వాటిని ఎవరైనా బ్రేక్ చేస్తే మాత్రం కోప్పడతారు. ముఖ్యంగా సెట్ కి లేటుగా వచ్చేవాళ్ళు అంటే అసలు నచ్చదు. పిలిచి మరీ క్లాస్ పీకుతారు.. అందుకే నేను ఉదయం 5:30 గంటలకే సినిమా సెట్ కి వెళ్ళిపోయే దాన్ని.. ఒకసారి లేట్ అయితే ఎవరికో క్లాస్ పీకడం నేను చూశాను.. అప్పటినుంచి అలా నాకు జరగకూడదని ఆయన కంటే ముందుగానే ఉదయాన్నే సెట్ లో ఉండేదాన్ని.. ఈ విషయం నేను మోహన్ బాబు దగ్గరనుంచి నేర్చుకున్నాను.. ఒక యాక్టర్ క్రమశిక్షణతో ఎలా ఉండాలి ? ఎలా ప్రవర్తించాలి? అనే విషయాలు ఆయన దగ్గరనుంచి నేర్చుకున్నాను.. పైకి కోపంగా కనిపిస్తారు కానీ ఆయన చాలా మంచి మనిషి.. అంటూ చెప్పుకొచ్చారు

లిరీష కెరియర్..

వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఇప్పుడు బుల్లితెరపై సత్తా చాటుతోంది. ఇకపోతే ఒకప్పుడు వెండితెరపై చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన ఈమె కమెడియన్ ఆలీ పరిచయం అయిన తర్వాత పొలిటికల్ రౌడీ సినిమాలో అవకాశం వచ్చిందని ఆ సినిమాతోనే తనకు బ్రేక్ వచ్చిందని చెప్పింది. మొత్తానికైతే ఆలీ వల్లే తాను వెలుగులోకి వచ్చానని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు