Kaarthikadeepam 2: హారతులిచ్చి మరీ టైం అండ్ డేట్ ఫిక్స్ చేశారుగా…!

తెలుగు టెలివిజన్ చరిత్రలో కార్తీకదీపం సీరియల్ ఒక సువర్ణ అధ్యాయము అని చెప్పవచ్చు.. స్టార్ మా సృష్టించిన ఈ సంచలనం ఇండియన్ స్థాయిలో అద్భుతమైన రేటింగ్స్ సొంతం చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కార్తీకదీపం సీరియల్ లో పాత్రలు సంతోష పడితే తెలుగు లోగిళ్ళు కూడా ఆనందించాయి .. ఆ పాత్రలు బాధపడితే వాళ్లకంటే ఎక్కువగా కన్నీళ్లు పెట్టుకున్న ప్రేక్షకులు వున్నారు.. ముఖ్యంగా డాక్టర్ బాబు , వంటలక్క, మోనిత పాత్రలకు ప్రేక్షకులు ఎంతలా కనెక్ట్ అయ్యారు అంటే వీరు బయట కనిపిస్తే చాలు.. ఆ పేర్లతోనే పిలవడం మొదలుపెట్టారు.. ఇక అలాంటి ఈ కార్తీకదీపం సీరియల్ సీక్వెల్ ఇప్పుడు మళ్లీ స్టార్ మా లో రాబోతోంది..

ఘనంగా కార్తీకదీపం 2 ప్రీ రిలీజ్ ఈవెంట్..

ఈ సీరియల్ రాబోతున్న నేపథ్యంలో తాజాగా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రేమీ విశ్వనాథ్ అలియాస్ వంటలక్క , నిరూపమ్ పరిటాల అలియాస్ డాక్టర్ బాబు పాల్గొన్నారు.. ఇకపోతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీరిద్దరికీ తెలుగు ఆడవాళ్లు హారతి ఇచ్చి మరీ తమ అభిమానాన్ని చూపించారు.. కార్తీకదీపం 2 సీరియల్ స్టార్ మా లో మార్చి 25 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారం చేయబోతున్నారు.

- Advertisement -

డాక్టర్ బాబు స్పందన..

ఇక ఈ ఈవెంట్ లో కార్తీక దీపం సీరియల్ గురించి డాక్టర్ బాబు మాట్లాడుతూ.. కార్తీకదీపం మొదటి సీజన్ నంబర్ వన్ సీరియల్ అనిపించుకుంది.. అప్పట్లో ప్రజాభిమానానికి కొలమానమైన బార్క్.. తెలుగు వాళ్ళు ఎంతగానో ఇష్టపడి చూసిన సీరియల్ అని లెక్కల్లో కూడా తేల్చి చెప్పింది… జాతీయస్థాయిలో రిలేషన్స్ , ఎమోషన్స్ ను అద్భుతంగా చూపించి ఫ్యామిలీ డ్రామా ని గొప్పగా పండించిన మొట్టమొదటి తెలుగు సీరియల్ కార్తీకదీపం అంటూ డాక్టర్ బాబు వ్యాఖ్యానించారు..

వంటలక్క ఏమన్నారంటే..

వంటలక్క మాట్లాడుతూ.. నేను ఎక్కువగా కన్నీళ్లు పెడతానని చాలామంది అంటారు.. నన్ను ఆశీర్వదించిన వాళ్లు ఉన్నారు.. ఇవాళ ఒకసారి వెను తిరిగి చూస్తే ఈ కార్తీకదీపం సీరియల్ మీకు ఎంతో ఇష్టమైన సీరియల్ గా మార్చిన ప్రతి క్షణాన్ని ప్రతి జ్ఞాపకాన్ని నేను గుర్తు చేసుకుంటున్నాను అంటూ ఆమె తెలిపింది.

రికార్డులు బద్దలే..

కార్తీకదీపం 2 వచ్చేది అప్పుడే.. ఐపీఎల్ కి తప్పని తిప్పలు..ఇకపోతే ఒక సీరియల్ కి ఈ రేంజ్ లో ప్రజాధారణ లభించడమే కాదు సీరియల్ కి సీక్వెల్ రావడం అంటే మామూలు విషయం కాదు.. ఇక ఈ సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో ఈ సీక్వెల్ ప్రారంభిస్తున్నట్లు చెప్పగానే అర్థమవుతుంది.. మొత్తానికైతే ఈసారి సరికొత్త కాన్సెప్ట్ తో మరొకసారి రికార్డులు బ్రేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు వంటలక్క మరియు డాక్టర్ బాబు.. మరి ఈ సీరియల్ ప్రేక్షక ఆదరాభిమానాలను ఏ విధంగా సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఐపీఎల్ పై ప్రభావం..

అయితే కార్తీకదీపం 2 సీరియల్ రావడం సంతోషంగానే అనిపిస్తున్న ఈ సంతోషం అటు ఐపీఎల్ పై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.. ఐపీఎల్ మ్యాచ్ ల కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసింది ఇలాంటి సమయంలో కార్తీకదీపం 2 సీరియల్ రాబోతున్న నేపథ్యంలో ఆడవాళ్ళు ఎక్కువగా టీవీ కే పరిమితం అవుతారు కాబట్టి మ్యాచ్ పై ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.. మొత్తానికి అయితే ఈ సీరియల్ ప్రభావం ఇంకా వేటిపై పడుతుందో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు