Rangabali : రిలీజైన సత్య స్పూఫ్ వీడియో – ఏముందని అంత హడావిడి

నాగ శౌర్య హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా రంగబలి. పవన్ భాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని ఎస్ఎల్విసి బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. యుక్తి తరేజా హీరోయిన్ గా కమెడియన్ సత్య, షైన్ టామ్ చాకో ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమా జులై 7 న విడుదలకు సిద్ధమైంది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కమెడియన్ సత్య ఒక చేసిన ఒక ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమాను తీయడం కన్నా, తీసిన సినిమాకు సరైన రీతిలో ప్రమోషన్స్ చేసి, జనాలు సినిమా చూసేలాగ చేయడం చాలా కీలకంగా మారింది. అందుకే మేకర్స్ కూడా దాదాపు సినిమా చేయడానికి ఎంత బడ్జెట్ అయితే పెడుతున్నారో, దానికి సమానంగా ప్రమోషన్స్ కూడా ఖర్చు చేస్తున్నారు.ఇందులో భాగంగానే ఇంటర్వ్యూలు, ప్రి రిలీజ్ ఫంక్షన్స్, ప్రెస్ మీట్స్ ఇలా జనాలు సినిమా గురించి మాట్లాడుకునే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు

అయితే ఇదే పద్ధతుల్లో కాస్త కొత్తగా చేద్దామని రంగబలి మూవీ టీం ఇటీవలనే ప్రముఖ జర్నలిస్టుల స్పూఫ్ లతో ఒక ఇంటర్వ్యూ వీడియోని చేసింది. కమెడియన్ సత్య ఆ జర్నలిస్టులను ఇమిటేట్ చేసాడు. అయితే ఈ వీడియోకి సంబంధించి ఒక టీజర్ కట్ చేసి రిలీజ్ చేయగా అది వైరల్ గా మారింది. అయితే ఆ వీడియోను చూసి ఆ ప్రముఖ జర్నలిస్టులంతా వీడియో రిలీజ్ చేయకుండా ఆపేసారు. దాంతో సోషల్ మీడియాలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగి, వీడియో రిలీజ్ చేయాలంటూ డిమాండ్ చేయడంతో సినిమాలలో వేసినట్టు ఒక డిస్క్లైమర్ వేసి ఇవాళ వీడియో రిలీజ్ చేసారు.

- Advertisement -

తీరా వీడియో చూస్తే అందులో ఏమి లేదు. సత్య జర్నలిస్టులందరిని బాగానే ఇమిటేట్ చేసిన, కంటెంట్ మాత్రం ఏమి లేదు. దాంతో అందరు ఏముందని హడావిడి చేసారు. అయిన మీరు ఇరిటేటింగ్ ప్రశ్నలు అడిగి సెలెబ్రెటీలను ఇబ్బంది పెట్టడం వాస్తవమే కదా అంటూ పోస్ట్ లు వేసి, సినీ జర్నలిస్ట్ లను ప్రశ్నిస్తున్నారు సోషల్ మీడియా యువత.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు