Mega family : చైతన్య జొన్నలగడ్డకు విడాకులిచ్చేసిన నిహారిక కొణిదెల

అనుకున్నదే అయింది. గతకొద్ది రోజులుగా మెగా డాటర్ నిహరికా కొణిదెల విడాకులు తీసుకోబోతుందంటూ ఫిల్మిఫై చెప్పిన వార్తేలే చివరికి నిజమయ్యాయి. నిహరికా కొణిదెల విడాకుల విషయంపై ఫిల్మిఫై ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందిస్తూనే వచ్చింది. ఫైనల్ గా ఈ అప్డేట్స్ లో చెప్పిన విషయాలే నిజం అయ్యాయి. . కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్ట్ లో తన భర్త చైతన్యతో విడిపోవడానికి చైతన్యతో ఇటీవలనే ఆమె డైవర్స్ కు అప్లై చేయగా కోర్ట్ అందుకు అంగీకరించింది.

గత కొద్దీ రోజులుగా తన భర్త చైతన్య జొన్నలగడ్డతో దూరంగా ఉంటున్న నిహారిక. శాశ్వతంగా చైతన్యతో విడిపోవడానికి గాను ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చింది. అయితే నిహారిక సినిమాలలో నటించటం ఏమాత్రం ఇష్టం లేని చైతన్య. పెళ్ళికి ముందే సినిమాల్లో నటించనని నిహారిక మాట ఇచ్చిన తరువాతనే ఆమెని పెళ్లి చేసుకున్నాడట. 2020 డిసెంబర్ 9న వీరిద్దరి పెళ్లి కూడా అంగరంగ వైభవంగా రాజస్థాన్ లో ఉదయపూర్ ప్యాలస్ లో ఘనంగా జరిగింది.

అయితే పెళ్లి తరువాత భర్తకు ఇచ్చిన మాట తప్పిన నిహారిక మళ్ళీ సినిమాల్లో నటిస్తానంటూ చైతన్యతో గొడవ చేయడం స్టార్ట్ చేసింది . కానీ చైతన్య దానికి ఒప్పుకోకపోవడంతో గొడవలు పెరిగాయి. కానీ మొండి పట్టు విడవని మెగా డాటర్ ఫైనల్ తాను అనుకున్నదే చేసింది. భర్త మాటను కాదని మళ్ళీ యాక్టింగ్ చేయడం స్టార్ట్ చేయడంతో చైతన్యకు నచ్చలేదు దాంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఫ్యామిలిలో ఎంత మంది ఎన్ని రకాలుగా నచ్చజెప్పిన ఫలితం మాత్రం దక్కలేదు.

- Advertisement -

ఫైనల్ గా మూడేళ్ళ వైవాహిక జీవితం తరువాత ఈ జంట విడాకులు తీసుకున్నారు. ఇటీవలనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు కూతురు పుట్టి మెగా ఫ్యామిలిలో సంతోషాన్ని నింపింది. అలాగే వరుణ్ తేజ్ కు ఈ మధ్యనే హీరోయిన్ లావణ్య త్రిపాఠితో నిశ్చితార్థం కూడా అయింది. ఇక అంత బాగుందని అనుకుంటుండగానే ఇంతలో నిహారిక విడాకుల న్యూస్ మెగా అభిమానుల్లో అసహనాన్ని కలిగిస్తుంది

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు