alia: మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్

యంగ్ హీరోయిన్ అలియా భట్, బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రీసెంట్ గానే మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. ఆరేళ్లు ప్రేమలో మునిగి తేలిన బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా – రణ్బీర్ లు ఏప్రిల్ 14న ఇరుకుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఈ జంట వివాహం ఘనంగా జరిగింది. అయితే పెళ్లి తర్వాత వీరిద్దరూ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న తొలి సినిమా ” బ్రహ్మాస్త్రం”. ఇండియన్ సినిమా చరిత్రలో భారీ బడ్జెట్, అత్యధిక సాంకేతికతతో ఈ చిత్రం రూపొందింది. ఈ సినిమాను తెలుగులో బ్రహ్మాస్త్రం అనే టైటిల్ తో దర్శక ధీరుడు రాజమౌళి డిస్ట్రిబ్యూట్ చేశారు. స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్ లైట్ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి.

అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సెప్టెంబర్ 9న రిలీజ్ కాగా.. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామిని సృష్టించింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ ఇద్దరు హీరో, హీరోయిన్లు కలిసి మరో ఇంటరెస్టింగ్ ప్రాజెక్టు చేయబోతున్నట్లుగా బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ కాంబోలో ఈసారి ఒక రోమ్ కామ్ సినిమా ప్లాన్ చేస్తున్నారట. కానీ ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది, దర్శకుడు ఎవరు అనే అంశాలకి సంబంధించి ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది. కాగా ఈ రియల్ కపుల్ జంటగా నటించే రెండవ చిత్రం కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు