కామెడీ జోనర్ డైరెక్టర్ మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టైటిల్ రాజా డీలక్స్ అని ప్రచారంలో ఉంది. ఈ సినిమాపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ, కొన్ని సందర్బాల్లో డైరెక్టర్ మారుతి సినిమా ఉందని, ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేయాలో తనకు క్లారిటీ ఉందని చెప్పాడు. అలాగే యూవీ క్రియేషన్స్ అధికారికంగా చెప్పకపోయినా, సన్నిహితవర్గాల వద్ద కన్ఫామ్ చేసిందని వార్తలు వచ్చాయి. దీంతో వీరి కాంబోలో సినిమా నిజమే అని అనుకుంటున్నారు.
అయితే కామెడీ జోనర్ సినిమాలు మాత్రమే చేసే మారుతి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను హ్యాండిల్ చేయగలడా అనే డౌట్స్ వచ్చాయి. ఈ డౌట్స్ తోనే ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయిందని వార్తలు వచ్చాయి. అలాగే, మారుతి దర్శకత్వంలో ఇటీవల పక్కా కమర్షియల్ సినిమా వచ్చింది. ఈ సినిమా అనుకున్నంత రాణించలేకపోయింది. దీని ప్రభావం ప్రభాస్ సినిమాపై పడిందని వార్తలు వినిపించాయి. మారుతి సినిమాపై ప్రభాస్ మనసు మార్చుకున్నాడని టాక్ వచ్చింది.
ఎట్టకేలకు ఈ వార్తలకు పుల్ స్టాప్ పడింది. ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో మాళవిక మోహనన్ రాజా డీలక్స్ పై హింట్ ఇచ్చింది. తెలుగులో తను తర్వాత చేయబోయే సినిమా గురించి నిర్మాతలు త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారని చెప్పింది. రాజా డీలక్స్ సినిమాలో అనుష్క, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా ఎంపిక అయ్యారని చిత్రసీమలో వినిపిస్తున్నాయి. దీంతో మాళవిక మోహనన్ చెప్పింది ఈ సినిమా గురించే అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.