Raghu thatha : మరో సినిమా షూటింగ్ పూర్తి చేసిన కీర్తి సురేష్

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ లో అందరి కన్నా బిజీ గా ఉన్న హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది కీర్తి సురేష్ అనే చెప్పాలి. రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన దసరా సినిమా రిలీజై ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో చెప్పనక్కర్లేదు. నాని హీరోగా నటించిన ఈ సినిమా ఆయన కెరీర్ లోనే మొదటి 100కోట్ల గ్రాసర్ గా నిలిచింది.

అయితే ఈ మధ్యనే ఓటిటిలో రిలీజైన దసరా జోరు తగ్గకముందే, మరో సినిమా షూటింగ్ కంప్లిట్ చేసింది కీర్తి సురేష్. కెజిఎఫ్, కాంతారా లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ఇండియాలో అతి పెద్ద నిర్మాణ సంస్థగా ఎదుగుతున్న హోంబ‌లె ఫిల్మ్స్ నిర్మాణంలో ఒక సినిమా వస్తోంది. ఈ సినిమాలో కీర్తి సురేష్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. రఘు తాత అనే టైటిల్ తో వస్తోన్న ఈ సినిమాని పాన్ ఇండియాగా సినిమాగా రిలీజ్ చేయడానికి హోంబ‌లె ఫిల్మ్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈమూవీ షూటింగ్ ఇటీవలనే కంప్లిట్ చేసుకుంది. ఈ సందర్బంగా షూటింగ్ పిక్స్ ని కీర్తి సురేష్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.

హిందీలో సూపర్ హిట్టైన ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ గురించి అందరికి తెలిసిందే. అయితే ఆ సిరీస్ కు రైటర్ గా పని చేసిన సుమన్ కుమార్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఇంట్లో ఉన్న సమస్యలతో పోరాడి, తరువాత సమాజంలో ఉన్న ఛాలెంజెస్ ని ఎదుర్కునే అమ్మాయి పాత్రలో కీర్తి కనిపించబోతుందని సమాచారం.

- Advertisement -

ప్రస్తుతం అందరమ్మాయిలు ఎదుర్కొంటున్న సీరియస్ అంశాలని, కథాంశం తీసుకొని కామెడీ అండ్ ఫన్ డ్రామాగా సినిమాని తెరకెక్కించారట. ఇటీవలనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తొందరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించుకొని అక్టోబర్ లో రిలీజ్ కి రెడీ అవబోతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు