Lawrence : వ‌చ్చే ఏడాది

ప్ర‌ముఖ కొరియోగ్రాఫర్ రాఘ‌వ లారెన్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. సినీ ఇండ‌స్ట్రీలో ఆయ‌న అన్ని రంగాల్లో ఆరితేరారు అని చెప్ప‌డంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా కొరియాగ్రాఫ‌ర్‌గా, న‌టుడిగా, ద‌ర్శ‌కునిగా, సంగీత ద‌ర్శ‌కుడిగా ఇలా ప‌లు విభాగాల్లో ప‌ని చేస్తూ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు లారెన్స్‌. ప్ర‌స్తుతం న‌టుడిగా పుల్ బిజీగా గ‌డుపుతున్నాడు. ఏకంగా నాలుగు సినిమాల‌ను సెట్స్ పై ఉంచారు. అందులో ‘రుద్ర‌న్’ ఒక‌టి. ఈ సినిమా తెలుగులో ‘రుద్రుడు’ అనే పేరుతో తెర‌కెక్కుతోంది.

క‌దిరేశ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం సౌత్‌లోని అన్ని భాష‌ల్లో విడుద‌ల కాబోతుంది. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన పోస్ట‌ర్స్ మంచి హైప్ క్రియేట్ చేశాయి. క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఈ సినిమాను డిసెంబ‌ర్ 23న విడుద‌ల చేయనున్న‌ట్టు ఇప్ప‌టికే మూవీ మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కానీ తాజాగా వాయిదా వేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్‌ ప్ర‌క‌టించింది. ఏకంగా మ‌రో నాలుగు నెల‌ల పాటు పోస్ట్ పోన్ చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉంది. కానీ వీఎఫ్ఎక్స్ ప‌నుల‌కు మ‌రింత స‌మ‌యం కేటాయించాల్సి ఉండ‌డంతో రుద్రుడు చిత్రాన్ని వాయిదా వేస్తున్న‌ట్టు తెలిపారు.

ఇక ఈ సినిమాను ఏప్రిల్ 14, 2023న త‌మిళంతో పాటు తెలుగు, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాషల్లో విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ సినిమాలో లారెన్స్ జంట‌గా ప్రియా భ‌వాని శంక‌ర్ న‌టిస్తోంది. జీ.వీ. ప్ర‌కాశ్ మ్యూజిక్ అందిస్తుండ‌గా.. ఫైవ్ స్టార్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై కదిరేశ‌న్ స్వీయ నిర్మాణంలో తెర‌కెక్కిస్తున్నాడు. ఈచిత్రంతో పాటు లారెన్స్ చంద్ర‌ముఖి సీక్వెల్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. పీ.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. అదిగార‌మ్‌, దుర్గ వంటి సినిమాల‌ను కూడా చేస్తున్నాడు లారెన్స్‌.

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు