Pawan kalyan: ఓజి షూటింగ్ కంప్లిట్ -షాక్ లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమా టీం పవన్ ఫ్యాన్స్ కి అప్డేట్ లతో పాటు, షాక్ లు కూడా ఇస్తుంది. ఇటీవలనే షూటింగ్ స్టార్ట్ అయిన ఓజి సినిమా అప్పుడే టాకీ పార్ట్ పూర్తి చేసిందనే న్యూస్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం పవర్ స్టార్ట్ పవన్ కళ్యాణ్ రాజకీయాలను, సినిమాలను పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. ఎందుకంటే విరివిగా ఒక పక్క పొలిటికల్ మీటింగ్ లకు హాజరవుతూనే, మరో పక్క అయన సినిమాల షూటింగ్ లను కూడా పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే బ్రో సినిమాకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ చాలా వరకు కంప్లిట్ చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఓజి సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి చేసాడని తెల్సుతోంది.

ముంబైలో మొదలైన ఓజి సినిమా షూటింగ్ ఇప్పటి వరకు మూడు షెడ్యూల్ లు కంప్లిట్ చేసుకోగా, ఎక్కువ శాతం పవన్ కళ్యాణ్ ఉన్న సీన్స్ నే షూట్ చేసి, పవన్ కళ్యాణ్ డేట్స్ లేని సమయంలో మిగితా ఆర్టిస్ట్ లపై షూటింగ్ చేయడంతో ఇప్పటి వరకు సినిమా 50% షూటింగ్ పూర్తయిపోయింది.

- Advertisement -

దానయ్య డివివి నిర్మాణంలో వస్తోన్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా, అర్జున్ దాస్, శ్రియ రెడ్డి, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా విడుదల తేదీని తొందర్లోనే ప్రకటించనున్నట్టు సమాచారం. ఇక పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తున్న బ్రో సినిమా వచ్చే జులై 28న రిలీజ్ అవుతున్న సంగతి తెల్సిందే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు