Jagapathi babu: ఆకట్టుకుంటున్న “రుద్రంగి” ట్రైలర్.. కానీ

టాలీవుడ్ లో తెలంగాణ నేపథ్యంలో సినిమాలు ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన బలగం, దసరా, మేం ఫేమస్ అలాంటి చిత్రాలే. అంతేకాదు రాబోతున్న భోళా శంకర్, భగవంత్ కేసరి లాంటి సినిమాల్లో తెలంగాణ యాసని అనుకరిస్తూ సినిమాలు చేస్తున్నారు. ఇక తాజాగా తెలంగాణ గడీల నేపథ్యంలో 1950స్ బ్యాక్ డ్రాప్ లో సినిమా వస్తుంది. అదే “రుద్రంగి”.

ఈ సినిమాను రసమయి ఫిల్మ్స్ బ్యానర్ లో తెలంగాణా ప్రముఖ గేయ రచయిత ‘రసమయి బాలకిషన్’ నిర్మించాడు. తాజాగా ఈ సినిమా యొక్క ట్రైలర్ రిలీస్ అయింది. ఈ సినిమా తెలంగాణ ప్రాంతంలో దొరల ఆకృత్యాలను, పరాజయాల కష్టాలను తెలుపుతూ సినిమా రూపొందించారు. రుద్రంగిలో ‘భీంరావ్ దొర’ గా జగపతి బాబు ప్రతినాయకుడి రోల్ లో నటించారు. ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా మమతా మోహన్ దాస్ నిలిచింది.

ఈ హీరోయిన్ చాలా రోజుల తర్వాత తెలుగులో నటించగా, ఆమె ఫిమేల్ లీడ్ గా జ్వాలా బాయి దేశముఖ్ గా నటించింది.  ఇక ఈ సినిమాలో ఆశిష్ గాంధీ హీరోగా నటించగా, విమలా రామన్, కాలకేయ ప్రభాకర్, గణవి లక్ష్మణ్ తదితరులు నటించారు. ట్రైలర్ చూస్తుంటే సినిమాకోసం బాగానే ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. కానీ తెలంగాణ 1950 ల కాలానికి సంబంధించిన సహజత్వం అంతగా కనిపించలేదు. అంతే కాక ఈ సినిమా మ్యూజిక్ కూడా అంత బాగా లేదు. మరి సినిమాలో ఎలా ఉందొ చూడాలి. ఇక రుద్రంగిలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

కానీ ట్రైలర్ కట్ లో ఇతర పాత్రల కంటే జగపతి బాబు పాత్రపైనే ఎక్కువ ఫోకస్ చేసినట్టు అనిపిస్తుది. ఓవరాల్ గా సినిమాలో యాక్షన్ సన్నివేశాలే ఎక్కువ ఉన్నాయి. కానీ సినిమా హిట్ కావాలంటే అదొక్కటి సరిపోదు. అంతకు మించిన ఎమోషన్ సినిమాలో ఉండాలి. ఇక రుద్రంగి సినిమాను అజయ్ సామ్రాట్ డైరెక్ట్ చేయగా, నౌఫాల్ రాజా మ్యూజిక్ అందించాడు. రుద్రంగి సినిమాను జులై7 న విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నారు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు