MS Dhoni: ధోని బర్త్ డే స్పెషల్. బయోపిక్ రీ రిలీజ్

మహేంద్ర సింగ్ ధోని.. తన గురించి తెలియని వారుండరు. పసిపిల్లాడి నుండి ముసలాడి వరకు ఇతనికి ఫ్యాన్స్ ఉన్నారు. పాతికేళ్ళ కలను నిజం చేస్తూ ఇండియాకి క్రికెట్ లో వరల్డ్ కప్ అందించిన హీరో. అంతే కాదు ఇండియన్ క్రికెట్ టీమ్ ని వరల్డ్ లోనే గొప్ప టీమ్ గా నిలబెట్టగా, ప్రపంచపు అత్యుత్తమ క్రికెట్ కెప్టెన్ గా నిలబడ్డాడు. సచిన్ తర్వాత ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతని సొంతం. ఎన్నో చోట్ల ధోని కి గుడికట్టిన క్రికెట్ ఫ్యాన్స్ ఉన్నారు.

ఇదిలా ఉండగా ధోని బయోపిక్ గా 2016 లో “ఎంఎస్ ధోని ది అన్ టోల్డ్ స్టోరీ” అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. సుశాంత్ రాజ్ పుత్ సింగ్ హీరోగా నటించిన ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ రోజుల్లోనే 200కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఎన్నో బయోపిక్ లు రావడానికి కారణమైంది. ఈ సినిమా ఇన్స్పిరేషన్ తో సచిన్ టెండూల్కర్, మిథాలీ రాజ్, అజార్, కపిల్ దేవ్ ల బయోపిక్ లు వచ్చాయి. అయితే ఏ సినిమా కూడా ధోని సినిమాలా ఆడలేదు. కారణం ఎమోషన్. రైల్వే స్టేషన్ లో ఒక టికెట్ కలెక్టర్ గా పని చేసే స్థాయి నుండి దేశానికి బెస్ట్ కెప్టెన్ అయ్యే స్థాయికి వచ్చాడు కాబట్టే ఆ సినిమా అంత హిట్ అయ్యింది.

ఇక ధోని బయోపిక్ లో నటించిన సుశాంత్ రాజ్ పుత్ అంతకు ముందే హీరోగా పలు సినిమాలు చేసినా ఈ సినిమా ద్వారానే స్టార్ గా గుర్తింపు పొందాడు. ధోని పాత్రలో నటించకుండా జీవించేశాడు. ఈ సినిమా తరువాత సుశాంత్ కి ఒక్కసారిగా ఏడెనిమిది సినిమాల ఆఫర్లు వచ్చి పడ్డాయి. ఈ సినిమాకి వెళ్లిన చాలా మంది ధోని ఫ్యాన్స్ సుశాంత్ కి కూడా ఫ్యాన్స్ అయిపోయారు. అయితే దురదృష్టవశాత్తు సుశాంత్ 2020లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ధోని సినిమా ద్వారానే దిశాపటాని, కియారా అద్వానీ లు హీరోయిన్లు గా గుర్తింపు పొందారు.

- Advertisement -

అయితే “ఎం ఎస్ ధోని” సినిమా మళ్ళీ రీ రిలీజ్ అవుతుంది. జులై 7 న ధోని బర్త్ డే కావడంతో తెలుగు రాష్ట్రాల్లో ధోని ఫ్యాన్స్ అంతా ఏకమై స్పెషల్ గా రీ రిలీజ్ చేయిస్తున్నారు. అయితే ఇంతకు ముందే ఎం ఎస్ ధోని మే 12 న రీ రిలీజ్ అయినా సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు మళ్ళీ ధోని బర్త్ డే సందర్బంగా రిలీజ్ అవుతుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates,Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు