Pushpa The Rule : వెయిట్ చేయాల్సిందేనా ?

టాలీవుడ్ ఈ మధ్య కాలంలో బాలీవుడ్ కు పోటీ ఇస్తుంది. సినీ ప్రపంచాన్నే తన వైపు తిప్పుకునేలా సినిమాలు వచ్చాయి. అందులో ’బాహుబలి‘, ’పుష్ప ది రైజ్‘, తో పాటు ఇటీవల వచ్చిన ’ఆర్ఆర్ఆర్‘ సినిమా కూడా ఉంది. ఇందులో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ’పుష్ప ది రైజ్‘ మాత్రం ఎవరు ఊహించలేనంత పెద్ద హిట్ అందుకుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, స్టెప్స్ ప్రపంచాన్నే ఊపేశాయి. సినీ ప్రముఖులతో పాటు చాలా మంది సెలబ్రెటీలు తగ్గేదెలే.. అంటూ షార్ట్ వీడియోస్ కూడా చేశారు.

ఇంత పెద్ద విజయం సాధించిన పుష్ప సినిమా సీక్వెల్ కోసం అల్లు, మెగా ఫ్యాన్స్ కాకుండా చాలా మంది సినీ లవర్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ, ఈ సినిమా సీక్వెల్ షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. పుష్ప టీం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం, సీక్వెల్ షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సింది. కానీ, మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో, పుష్ప ది రూల్ పై అంచనాలు విపరీతంగా ఉన్నాయి. ఈ అంచనాలను అందుకోవడానికి సమయం తీసుకున్నా, మంచి అవుట్ పుట్ ఇవ్వాలని డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నాడు. అందుకే షూటింగ్ ఆలస్యమవుతుంది.

అయితే, ఆగస్టు మొదటి వారంలో కానీ, రెండో వారంలో కానీ, పుష్ప ది రూల్ షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇండస్ట్రీలో కూడా అలాంటి వార్తలే వచ్చాయి. కానీ, తాజాగా ఐకన్ స్టార్ అల్లు అర్జున్ లుక్ చూస్తే, పుష్ప సీక్వెల్ ఇప్పట్లో స్టార్ట్ కాదని అర్థమవుతుంది.

- Advertisement -

బన్నీ తాజా గా రెడ్ బస్ యాడ్ షూటింగ్ కోసం బయటకు వచ్చాడు. యాడ్ షూటింగ్ సమయంలోని అల్లు అర్జున్ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యేక్షమయ్యాయి. ఈ ఫోటోలో బన్నీ షార్ట్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. నిజానికి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాంగ్ హెయిర్ తో ఉంటాడు. పుష్ప పార్ట్ 2 లో కూడా అదే లుక్ తో ఉండాలి. కానీ, ఇప్పుడు షార్ట్ హెయిర్ తో ఉన్నాడు. దీంతో పుష్ప ది రూల్ సినిమా షూటింగ్ కు ఇంకా టైం ఉందని, అందుకే బన్నీ హెయిర్ కట్ చేసుకున్నాడని అభిమానులు అనుకుంటున్నారు.

కాగా, పుష్ప పార్ట్ 2 షూటింగ్ సెప్టెంబర్ చివర లేదా అక్టోబర్ మొదటి వారంలో స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. అయితే, బన్నీ ఫ్యాన్స్ షూటింగ్ స్టార్ట్ అయ్యే వరకు నమ్మలేం దొర అని అంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు