పూరి జగన్నాథ్ తెరకెక్కించిన సినిమా లైగర్. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి కొన్ని ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూటర్లకు డబ్బు తిరిగి వెనక్కి ఇస్తానని చెప్పిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ధర్నాలు చేయడం, అందుకు పూరి జగన్నాథ్ ధర్నాలు చేస్తే డబ్బులు ఇవ్వనని చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా లైగర్’ చిత్ర ఆర్థిక లావాదేవీల వ్యవహారంలో ఆ చిత్ర ఎగ్జిబిటర్లైనటువంటి ఆడెపు శ్రీనివాస్ అలియాస్ వరంగల్ శీను, సినీ ఫైనాన్షియర్ శోభన్‌బాబు అలియాస్ శోభన్ తనను వేధిస్తున్నారని దర్శకుడు పూరీ జగన్నాథ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. వారితో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని రాసిన లేఖను వ్యక్తిగత సహాయకుడు శ్రవణ్ ద్వారా పోలీసులకు పంపారు.
Read More: Pooja Hegde:పూజా హెగ్డే లోదుస్తులపై సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న కుర్రాళ్ళు..!
పోలీసుల కథనం ప్రకారం.. జగన్నాథ్‌కు చెందిన పూరీ కనెక్ట్స్ ఎల్‌ఎల్‌పీ ఆధ్వర్యంలో స్వీయ దర్శకత్వంలో ‘లైగర్’ చిత్రం తీశారు. సినిమా పంపిణీ వ్యవహారంలో కాకతీయ ఎగ్జిబిటర్స్ నిర్వాహకుడు వరంగల్ శ్రీనుతో ఏప్రిల్ 12న ఒప్పందం చేసుకున్నారు. సినిమా నష్టాలపాలవ్వడంతో దాదాపు 80 మందికిపైగా ఎగ్జిబిటర్లంతా గురువారం జూబ్లీహిల్స్‌లోని పూరి జగన్నాథ్ ఇంటికి రావాలని సామాజిక మాధ్యమాల వేదికగా నిర్ణయించుకున్నారు. తన పరువు తీసేందుకు కుట్ర చేస్తున్నారని, డబ్బు తిరిగి చెల్లిస్తానని చెప్పినా పలువురు బెదిరింపులకు పాల్పడ్డారంటూ పూరీ తాజాగా విడుదల చేసిన ఓ ఆడియోలోనూ పేర్కొన్నారు. ఎగ్జిబిటర్లు తన ఇంటిపై దాడి చేసే అవకాశం ఉందనే అనుమానంతో రక్షణ కోరుతూ పోలీసులకు లేఖను రాశారు. పూరీ జగన్నాథ్ ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు తెలిపారు.
Read More: Dasara: ఆ యంగ్ డైరెక్టర్ సీక్రెట్ గా పెళ్లి చేసుకోడానికి కారణం ఏంటో తెలుసా ?
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...