అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వి కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే. ఆమె చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ దక్కించుకుంది. “ధడక్” చిత్రంతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది జాన్వి కపూర్. ఇటీవల “గుడ్ లక్ జెర్రీ” మూవీ సక్సెస్ తో నటిగా మరింత పేరుని సంపాదించుకుంది.
అలాగే అక్షయ్ కుమార్, టైగర్ స్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న మూవీ ” బడే మియా చోటే మియా”. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకుడు. టైగర్ సరసన జాన్వి కపూర్ నటించనుందని.. ఆ చిత్రంలో పాత్ర కోసం జాన్వినే దర్శకుడు అబ్బాస్ కోరుకుంటున్నాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. వచ్చేనెల లండన్ లో జరగనున్న షెడ్యూల్ లో జాన్వి పాల్గొనబోతున్నట్లులు సమాచారం.
Read More: Dear Comrade: నాలుగేళ్లు కామ్రేడ్
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో భాగంగా జాన్వి కపూర్ మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తనకి ఓ హీరోతో నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. నేటి టాలీవుడ్ యువనటుల్లో అందరూ తనకు ఇష్టమైన వారేనని.. ఒకవేళ తనకి అవకాశం వస్తే మాత్రం యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి సినిమా చేయాలని ఉందని తన మనసులోని మాటని బయటపెట్టింది. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా చూశానని.. అందులో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా అద్భుతంగా నటించారని చెప్పుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ తో నటించాలనే ఆమె కల నెరవేరుతుందో లేదో వేచి చూడాలి.
Read More: Ori Devuda : పెద్ద హిట్ అవ్వాలి
హర్యానా మాజీ ముఖ్యమంత్రి చౌదరి మనవడు,...
‘శ్రీమంతుడు’ సినిమాతో బ్లాక్ బస్టర్...
మొదట సీరియల్స్ ద్వారా తన కెరీర్ ను మొదలుపెట్టి...
ఒక సినిమాకు డైరెక్టర్… కెప్టెన్ అఫ్ ది...
అల్లు అర్జున్ హీరోగా ప్రముఖ డైరెక్టర్...