Prasannavadanam Movie Twitter Review : ప్రసన్నవదనం ట్విట్టర్ రివ్యూ

Prasannavadanam Movie Twitter Review : ఛాయ్ బిస్కెట్ అనే యూట్యూబ్ ఛానల్ లో కొన్ని వీడియోస్ చేసుకుంటూ ఆ తర్వాత ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్నాడు సుహాస్. సుహాస్ యూట్యూబ్ లో వీడియోస్ చేసినప్పుడే చాలామంది సెలబ్రిటీల దృష్టిని ఆకర్షించాడు అని చెప్పొచ్చు. దీనికి కారణం సుహాస్ కి ఉన్న టాలెంట్. ఒక పాత్రలో ఒదిగి పోవడం, ఆ పాత్రలో ఒదిగిపోయి ప్రేక్షకుడిని మెప్పించడం సుహాస్ కి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పొచ్చు.

ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో కనిపించాడు సుహాస్ . కొన్ని సినిమాల్లో కీలకపాత్రలు దక్కాయి అని చెప్పొచ్చు. సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయమైన కలర్ ఫోటో అనే సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు సుహాస్. అయితే కరోనా టైం కావటం వలన ఆ సినిమా థియేటర్లో విడుదలకు నోచుకోలేదు. కానీ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినా ఆహాలో రిలీజ్ అయింది. ఆ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అక్కడితో సుహాస్ కి కూడా హీరోగా బ్రేక్ వచ్చిందని కూడా చెప్పొచ్చు.

ఆ తర్వాత సుహాస్ చేసిన సినిమా రైటర్ పద్మభూషన్. ఈ సినిమాని చాయ్ బిస్కెట్ సంస్థ నిర్మించింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ తో పాటు విమర్శకులు ప్రశంసలను కూడా అందుకుంది. ఈ సినిమాతో మరింత గుర్తింపును సాధించుకున్నాడు సుహాస్. ఇక రీసెంట్ గా సుహాస్ నటించిన సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వలన రిలీజ్ డేట్ పోస్టుపోన్ అవుతూ వచ్చింది. అయితే ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయి అద్భుతమైన కలెక్షన్లను సాధించింది. అలానే విమర్శకులు ప్రశంసలను కూడా అందుకుంది.

- Advertisement -
Prasannavadanam Movie First Review : Prasannavadanam First Review
Prasannavadanam Movie twitter Review

ఇకపోతే సుహాస్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం ప్రసన్నవదనం. ఈ సినిమాను గత రాత్రి హైదరాబాద్లో కొంతమందికి ప్రివ్యూ వేశారు. అయితే ఈ ప్రీమియర్ చూసినవాళ్లంతా కూడా ఈ సినిమాపై పాజిటివ్ రెస్పాన్స్ ను అందిస్తున్నారు. ఈ సినిమా కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని,దర్శకుడు అర్జున్ సరికొత్త కథని రాసుకున్నట్టు తెలుస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగా వర్కౌట్ అయింది. కొన్ని సీన్లు బాగున్నాయి. విజయ్ బుల్గానిన్ అందించిన మ్యూజిక్ అద్భుతంగా ఉందంటూ కొంతమంది ఈ సినిమాను కొనియాడుతున్నారు.

సుహాస్ ఇప్పటివరకు నాలుగు సినిమాలు చేశాడు. ఈ నాలుగు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయం సాధించాయి. గొప్ప సినిమాలను ఎంచుకున్న అతి తక్కువ మంది నటులలో సుహాస్ కూడా ఒకడు అని తను సినిమాలతో ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏదేమైనా నేడు ప్రేక్షకులు ముందుకు రానున్న ప్రసన్నవదనం సినిమాకి ఆల్రెడీ పాజిటివ్ రెస్పాన్స్ మొదలైంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు