Prabhas VS Shah Rukh Khan: సినిమాల ఫైట్ మాత్రమే కాదు… ఇండస్ట్రీల మధ్య ఫైట్

Prabhas VS Shah Rukh Khan

ఇయర్ ఎండ్ వార్… ఇయర్ ఎండ్ సెల్ ఉంటుంది కానీ, ఈ ఇయర్ ఎండ్ వార్ ఏంటి అనుకుంటున్నారా? అవును అండి మీరు విన్నది నిజమే ఈ ఏడాది ఇయర్ ఎండ్ వార్ జరగబోతుంది. అదే సలార్ Vs డంకీ. (Prabhas VS Shah Rukh Khan) దీన్ని సలార్ vs డంకీ అనడం కంటే.. సౌత్ ఇండస్ట్రీ Vs నార్త్ ఇండస్ట్రీ అనడం బెటరేమో. ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ ఇదే మరి.

సలార్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్…
2000 కోట్ల కొల్లగొట్టిన హీరో…
మరో వైపు కేజీఎఫ్‌తో రెండు సార్లు 1000 కోట్లు కలెక్ట్ చేసి, ఓటమి ఎరుగని డైరెక్టర్ ప్రశాంత్ నీల్…

ఈ కాంబోలో సినిమా వస్తే బాక్సాఫీస్ షేక్ అవ్వడం, కలెక్షన్ల సునామీలు రావడం ఖాయం. అలాంటి సినిమానే సలార్. ఈ మూవీ డిసెంబర్ 22న రాబోతుంది. ఇది అఫీషియల్ కాకపోయినా, ప్రశాంత్ నీల్ వైఫ్ ఇచ్చిన సమాచారాన్ని చూస్తే కన్ఫామ్ అని తెలుస్తోంది. ఇప్పుడే అసల సమస్య. ఎందుకంటే, సరిగ్గా అదే డేట్‌నా షారుక్ ఖాన్ డంకీ మూవీ రిలీజ్ అవుతుంది.

- Advertisement -

డంకీ…
పఠాన్, జవాన్ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ 1000 కోట్లు కొల్లగొట్టిన హీరో…
రాజ్ కుమార్ హీరానీ.. 30 ఏళ్ల కెరీర్‌ ఫ్లాప్ అనే మాట వినని డైరెక్టర్…
అంతే కాదు… పీకే, త్రీ ఇడియట్స్ వంటి ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్…
వీరి కాంబోలో మూవీ వస్తే… దాని రిజల్ట్ ఆలోచనలకు కూడా అందదు కదా…

ఇప్పుడు ఈ రెండు సినిమాలు ఒకే డేట్‌న రిలీజ్ అవుతే ఎలా ఉంటుంది. అప్పుడు వచ్చే సునామి ఊహకు కూడా అందదు. ఇటు సౌత్ ఇండస్ట్రీకి అటు నార్త్ ఇండస్ట్రీకి కలెక్షన్ల వరద పారుతుంది.

అయితే ప్రస్తుతం ఈ లెక్కల గురించి చర్చ జరగడం లేదు. అందరూ సలార్ Vs డంకీ మధ్య పోరును రెండు ఇండస్ట్రీల మధ్య పోరుగా చూస్తున్నారు. ఇటు ప్రభాస్ ఫ్యాన్స్… అటు షారుక్ ఖాన్ ఫ్యాన్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వార్ స్టార్ట్ చేశారు. తమ హీరో గొప్ప అంటే తమ హీరో గొప్ప అంటూ పక్క హీరోపై ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాదు… ఇండస్ట్రీలను కూడా టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

నిజానికి డిసెంబర్ లో ఈ రెండు సినిమాలు రిలీజ్ అవుతే… ఇప్పటి వరకు ఉన్న బజ్ ప్రకారం.. వీటికి మంచి ఓపెనింగ్స్ మాత్రమే కాదు, లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్లు వస్తాయి. డంకీ మూవీ అటు నార్త్ తో పాటు సౌత్ లోనూ రాణిస్తుంది. అలాగే సలార్ మూవీకి కూడా ఇటు సౌత్ తో పాటు నార్త్ లోనూ మంచి కలెక్షన్లు వస్తాయని చెప్పొచ్చు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు