Skanda: ప్రేమలో శ్రీలీల.. ఎట్టకేలకు అసలు విషయం బయటపెట్టిన యంగ్ బ్యూటీ..!

Skanda:

యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో వచ్చిన పెళ్లి సందD అనే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తొలి సినిమాతోనే కుర్ర కారు చూపుని తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత మాస్ మహారాజా రవితేజతో కలిసి ధమాకా సినిమాలో నటించి రెండు సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. యూత్ లో ఈ బ్యూటీ కి ఉన్న క్రేజే వేరు.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం రామ్ పోతినేని – బోయపాటి శ్రీను దర్శకత్వంలో స్కంద అనే సినిమాతో సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా తన లవ్ గురించి ఓపెన్ అయ్యింది శ్రీలీల. గత కొంతకాలంగా శ్రీలీల ఓ డాక్టర్ తో ప్రేమలో పడిందని, ఆ తర్వాత అతడితో బ్రేకప్ జరిగిందని వార్తలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగాయి. ఈ రూమర్స్ పై స్కంద ప్రమోషన్స్ లో శ్రీలీల మాట్లాడుతూ.. తాను ఇప్పటివరకు ప్రేమలోనే పడలేదని, కాబట్టి బ్రేకప్ అనే ప్రశ్న తలెత్తదని సమాధానం చెప్పింది.

ఇప్పటివరకు తను ఎలాంటి రిలేషన్షిప్ పెట్టుకోలేదని తెలిపిన ఈ బిజీ హీరోయిన్.. తనకి ప్రేమలో పడాలని ఉందంటూ తన మనసులోని కోరికను బయటపెట్టింది. అయితే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ప్రేమ అనే దశను ఎంజాయ్ చేయాలని.. అలాంటి దశను తాను కూడా చూడాలని అనుకుంటున్నాట్లు చెప్పుకొచ్చింది. కానీ ప్రేమలో పడి ఆ మాధుర్యాన్ని ఆస్వాదించే సమయం తనకు ఇప్పుడు లేదని స్పష్టం చేసింది. అయితే శ్రీlee చేసిన ఈ వ్యాఖ్యలపై దాదాపు 10 సినిమాలను చేతిలో పట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ప్రేమ జోలికి ఏం వెళుతుందిలే..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు