Prabhas : పవర్ ఫుల్

బాహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు. దీని తర్వాత డార్లింగ్ వరుసగా పాన్ ఇండియా సినిమాలనే చేస్తున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన పాన్ ఇండియా సినిమాలు సాహో, రాధేశ్యామ్ అంచనాలను అందుకోలేకపోయాయి. అయినా ప్రేక్షకులకు ప్రభాస్ నుంచి రాబోయే సినిమాలపై ఆసక్తి తగ్గలేదు. ఇటు దక్షిణాదిన అటు బాలీవుడ్ లో అందరి చూపు రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలపైనే ఉంది.

ప్రభాస్ లిస్టులో ఉన్న చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ఈ సినిమాపై ఉన్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకు కారణం ప్రభాస్ ఒకటైతే, మరో కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవల ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎన్ని రికార్డులు నమోదు చేసిందో అందరికీ తెలుసు. దీని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. అలాగే ప్రశాంత్ నీల్ – ప్రభాస్ కాంబోలో సినిమా అంటే మాస్ ఆడియన్స్ కు ట్రీట్ పక్కా ఉంటుంది అనడంలో డౌటే లేదు. అయితే ఈ ఏడాది ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన సలార్ సినిమా, కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం సలార్ సినిమా చిత్రీకరణను జరుపుకుంటుంది.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ వచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సలార్ టీం బిగ్ అప్డేట్ వదిలింది. సలార్ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు ప్రశాంత్ నీల్ ప్రకటించారు. ఈ మేరకు ప్రభాస్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో ప్రభాస్ చాలా పవర్ ఫుల్ లుక్ లో కనిపిస్తున్నాడు. ఇక అప్డేట్ తో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.

- Advertisement -

https://twitter.com/prashanth_neel/status/1559079443196362752?s=20&t=5vpgOuaXDe7Nz0-oMGixnw

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు