Mallidi Vashisht : బిగ్ ఆఫర్

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే రాజకీయాలలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. ఇక ఇటీవల అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్య, ప్రస్తుతం తన తర్వాత సినిమాలపై దృష్టి సారిస్తున్నారు.

ఇప్పటికే గోపీచంద్ మలినేనితో వస్తున్న NBK107 తో ఫుల్ బిజీగా ఉన్నాడు. అప్పుడే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమా చేస్తున్నారు. వరస హిట్లతో జోరు మీదున్న అనిల్ రావిపూడి ఈ సినిమాపై తాజాగా అధికారిక ప్రకటన కూడా చేశారు.

ఇదిలా ఉంటే ఇటీవలే కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార సినిమాను బాలయ్య ఫ్యామిలీతో కలిసి వీక్షించారు. ఈ సినిమా చూసిన తర్వాత చిత్ర యూనిట్ ను బాలకృష్ణ అభినందించారు. “సినిమా చాలా బాగుంది. సినిమాలో భావితరాలకు కావాల్సిన సందేశం ఉంది. అందరూ తప్పక చూడండి” అంటూ తన ఫ్యాన్సును కోరారు బాలయ్య. అంతేకాదు, అబ్బాయి కళ్యాణ్ రామ్ ను, డైరెక్టర్ వశిష్టును అభినందించారు. అలాగే తప్పకుండా కలిసి సినిమా చేద్దాం అంటూ దర్శకుడు వశిష్టుకు ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. మరి బాలయ్య కోసం వశిష్టు ఎలాంటి కథను సిద్ధం చేస్తాడేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు