Prabhas : రెండు దశాబ్దాలు

కృష్ణంరాజు నట వారసుడిగా ప్రభాస్  టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. అప్పటి తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి, మెగాస్టార్, అక్కినేని, సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీల హవా కొనసాగుతుంది. అప్పటికే కృష్ణంరాజు సినిమాలను అడపదడపా చేస్తూ.. తన నట వారసుడిగా తమ్ముడు సూర్యనారాయణ రాజు  కుమారుడు అయినటువంటి ప్రభాస్ 2001 ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. జయంత్ సి. ఫర్జానీ దర్శకత్వంలో నిర్మాత అశోక్ కుమార్ శ్రీలక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈశ్వర్ నవంబర్ 11, 2002న విడుదలైంది. అంటే నేటికి సరిగ్గా 20 ఏళ్లన్న మాట. 

సినిమాల్లోకి రాకముందు ప్రభాస్ కి ఏం చేయాలో కూడా తెలియదట. పీజీ చేద్దామనుకున్నాడట. అంతలోనే పెద్దనాన్న సినీ రంగం వైపు లాగడంతో ఈ విషయాన్ని స్నేహితులకు చెబితే పకపక నవ్వుకున్నారట. సత్యానంద్ దగ్గర మూడు నెలల పాటు శిక్షణ తీసుకున్నారట. ఆ తరువాత నిర్మాత అశోక్ కుమార్ రెబల్ స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ తండ్రి సూర్య నారాయణరాజులను కలిసి మీ అబ్బాయితో ఓ సినిమా చేయాలని చెప్పారట. అలా తొలిసినిమా ఈశ్వర్ లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చాడు ప్రభాస్. 

2002 జులై 28న రామానాయుడు స్టూడియోలో ప్రభాస్ హీరోగా పరిచయమవుతూ ఈశ్వర్ సినిమాని ప్రారంభించారు. ప్రభాస్ పై ఆయన పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు క్లాప్ కొట్టి సూపర్ స్టార్ గా ఎదగాలని దీవించారు. ఇక ప్రభాస్ తొలి సినిమాలోనే అద్భుతంగా నటించాడు.  ఈశ్వర్ సినిమా యావరేజ్ గా నడిచినప్పటికీ ఆ తరువాత వచ్చిన రాఘవేంద్ర సినిమా అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది. ఆ తరువాత వచ్చిన వర్షం సినిమా ప్రభాస్ కెరీర్ నే మార్చేసింది. వర్షం, ఛత్రపతి, బాహుబలి సినిమాలు ప్రభాస్ కి మంచి స్టేటజీని తీసుకొచ్చాయి. బాహుబలి సినిమాతో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ప్రభాస్ ఈశ్వర్ సినిమా విడుదలై 20 ఏళ్లు గడిచిన సందర్భంగా అభిమానుల కోసం నవంబర్ 11, 2022 న వర్షం సినిమాను రీ రిలీజ్ చేశారు. 

- Advertisement -

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు