NBK : ఊహకందని కాంబినేషన్..

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బీజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తరువాత  ఎఫ్ 3 అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. ఇక వీరి కాంబినేషన్ కచ్చితంగా టాలీవుడ్ లో సెన్సేషన్ అవుతుంది. 

ఇలా వరుస సినిమాలను చేస్తూనే మరోవైపు ఆహా ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అంటూ అందరి థింకింగ్ ని మార్చేస్తున్నాడు. సీనియర్స్ అయినా, కుర్రాళ్లనైనా తన మాటలతో ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ షో సెంకడ్ సీజన్ జరుగుతోంది. దీంతో అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తో మంచి సాన్నిహిత్యం పెరిగింది. ఇటీవల అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరిష్ నటించిన ఊర్వశివో రాక్షశివో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా బాలయ్య చీఫ్ గెస్ట్ గా వెళ్లడం విశేషం. 

ఇది ఇలా ఉంటే నందమూరి నటసింహం గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఎవ్వరూ ఊహించని విధంగా వెంకటేష్ మహా దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కేరాఫ్ కంచరపాలెం సినిమాతో విమర్శకులను కూడా  మెప్పింపజేశాడు వెంకటేష్ మహా. ఆ తరువాత ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు.  వెంకటేష్ మహా చెప్పిన కథకు బాలయ్య ఓకే అనేసినట్టు సమాచారం. బాలయ్య ఈ మధ్య కొత్త కథలను ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు. బాలయ్య ఇప్పటివరకు చేయని పాత్రలో వెంకటేష్ మహా కేవలం 30 రోజుల్లోనే ఈ సినిమాని పూర్తి చేసేవిధంగా ప్లాన్ చేస్తున్నాడట. బాలయ్యతో  దర్శకుడు వెంకటేష్ మహా కు ఛాన్స్ రావడంతో చాలా సంతోషపడుతున్నాడని టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా గురించి అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారో అప్పటి  వేచి చూడాలి. 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు