Gunturu Karam : పాపం పూజా హెగ్డే ! తలనొప్పిగా మారిన నెటిజన్ల విమర్శలు..

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అవుతున్న పూజా హెగ్డే కి అప్పుడే గడ్డుకాలం మొదలైంది. అయితే ప్రస్తుతం ఈ బుట్టబొమ్మ చేతిలో సినిమాలేవీ లేకపోవడంతో నెటిజన్ల చేతిలో తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

నాగ చైతన్య హీరోగా నటించిన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు తెరకి పరిచమైన ఈ ముంబై బ్యూటీ అనాది కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాని సంపాదించుకుంది. కెరీర్ బిగినింగ్ లోనే పూజా హెగ్డేకి టాప్ హీరోలతో పని చేసే అవకాశం రావడంతో ఈ బ్యూటీకి సినిమా కష్టాలు ఎలా ఉంటాయో పెద్దగా ఎక్స్ పీరియన్స్ చేసే అవకాశం లేకుండా పోయింది.

అయితే తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూనే బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని ప్రయత్నించగా ఆ ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. టాలీవుడ్ ఇచ్చిన స్టార్ హీరోయిన్ స్టేటస్ పూజా హెగ్డే కి బాలీవుడ్ లో మంచి అవకాశాలే తెచ్చిపెట్టాయి గాని హిట్లు మాత్రం ఇవ్వలేకపోయాయి. బాలీవుడ్ స్టార్ హీరోలైన రణ్ వీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లతో నటించే ఛాన్స్ కొట్టేసిన పూజా హెగ్డే ఆ సినిమాలు ఫ్లాప్ అవడంతో ఢీలా పడిపోయింది.

- Advertisement -

దానికి తోడు మొదట్లో టాలీవుడ్ కి లక్కీ చార్మ్ గా ఉన్న పూజా, గత కొద్దికాలంగా ఈమె ఐరెన్ లెగ్ అనే ట్యాగ్ ని మోయాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో ఆమె చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవుతూ వస్తుడటంతో ఈ బ్యూటికి సినిమాలు కరువయ్యాయి. ప్రస్తుతం పూజా హెగ్డే మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా తప్ప వేరే సినిమాలేవీ చెయ్యట్లేదు. దాంతో పూజా మొదటిసారి సినిమా కష్టాలను ఎక్స్ పీరియన్స్ చేస్తుంది. అయితే ఇటీవలనే ఆమె తన ఇంస్టాగ్రామ్ లో సమ్మర్ హాలిడేస్ ని ఇంటిదగ్గర ఎంజాయ్ చేస్తున్న అని పోస్ట్ చేయడంతో. నెటిజన్లు ఇక అక్కడే ఉండిపో, నీకేలాగు సినిమా అవకాశాలు రావులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దాంతో నెటిజన్ల కామెంట్స్ పూజా కి తలనొప్పిగా మారాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు