Leo: సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న త్రిష ! లైన్ అప్ చూస్తే మతిపోవాల్సిందే

సాధారణంగా సినీ పరిశ్రమలలో హీరోయిన్ల కెరీర్ లు మిగితా వాళ్ళతో పోల్చి చూస్తే వేరుగా ఉంటాయి. చేతిలో సినిమాలున్నంత సేపు బిజీ, బిజీ గా ఉండే వీళ్ళ లైఫ్, ఒక్కసారి అవకాశాలు తగ్గితే మాత్రం వీళ్ళని ఎవరు పట్టించుకోరు. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరోయిన్ ఎదో ఒక సమయంలో ఈ రకమైన పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది.

ఇక విషయానికొస్తే ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్ గా, సౌత్ క్వీన్ వరుస సినిమాలతో దూసుకుపోయిన త్రిష కెరీర్ కి ఒక్కసారిగా బ్రేక్ పడింది. టాలీవుడ్ లో ఉన్న దాదాపు స్టార్ హీరోలందరితోను వర్క్ చేసిన త్రిష బాలకృష్ణ హీరోగా నటించిన లయన్ సినిమా తరువాత తెలుగులో ఏ సినిమా కమిట్ అవ్వలేదు. అలాగే తమిళ్ లో కూడా ఈమె కెరీర్ అంతంత మాత్రంగానే సాగింది.ఆ తరువాత విజయ్ సేతుపతి హీరోగా వచ్చిన96 సినిమా ద్వారా ఈ కెరీర్ మళ్ళీ ఊపందుకుంది అని చెప్పొచ్చు.

ఇటీవలనే త్రిష మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించగా, ఈ సినిమా తెలుగులో కూడా రిలీజై ఒక మోస్తరు విజయాన్ని సాధించింది. అయితే తమిళ్ లో మాత్రం ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దాంతో త్రిషకి మళ్ళీ తమిళ్ లో వరుస సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈమె లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో, తలపతి విజయ్ హీరోగా వస్తోన్న లియో సినిమాలో నటిస్తుంది. అలాగే కమల్ హాసన్, మణిరత్నం దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా త్రిషనే తీసుకుబోతున్నరట.

- Advertisement -

దాంతోపాటు అజిత్ హీరోగా వస్తోన్న సినిమా, ధనుష్ 50, మోహన్ లాల్ లేటెస్ట్ సినీ ఫ్రాంచైజ్ లలో త్రిషనే హీరోయిన్ గా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అలాగే తెలుగులో కూడా రవితేజ హీరోగా, అనుదీప్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ గా త్రిష పేరునే పరిశీలిస్తున్నారని సమాచారం. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ఏ యంగ్ హీరోయిన్ చేతిలో లేని సినిమాలు త్రిష చేతిలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ లైన్ అప్ గనక నిజమైతే త్రిష మరోసారి సౌత్ క్వీన్ అవడం ఖాయం.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు