Pawan Sai: విడాకులు తీసుకున్న బుల్లితెర యంగ్ హీరో..కారణం..?

Pawan Sai.. ప్రస్తుత కాలంలో సెలెబ్రిటీలు ఎంత వేగంగా వివాహం చేసుకుంటున్నారో అంతే వేగంగా చిన్న చిన్న మనస్పర్ధల కారణంగా క్షణికావేశంలో విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఎక్కువగా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలే విడిపోతున్నారు. ఈ మనస్పర్ధలు కారణంగా మరో పెళ్లి కూడా చేసుకుంటున్నారు. అదేవిధంగా వెండితెర యాక్టర్స్ మాత్రమే కాదు బుల్లితెర యాక్టర్స్ కూడా మనస్పర్ధలు కారణంగా విడిపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బుల్లితెర నటుడు విడాకులు తీసుకొని అందరిని ఆశ్చర్యపరిచారు.. మరి ఆ బుల్లితెర నటుడు ఎవరు? ఎందుకు విడిపోయారు? అనే విషయం ఇప్పుడు చూద్దాం..

విడాకులు తీసుకున్న పవన్ సాయి..
బుల్లితెర హీరో పవన్ సాయి.. ఈ పేరు చెబితే వెంటనే గుర్తుపట్టడం కష్టం కానీ ముద్దమందారం సీరియల్ అంటే మాత్రం అందరికీ ఇట్టే గుర్తుకొచ్చేస్తారు. ముద్దమందారం సీరియల్ తో భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ సాయి సినిమాలలో కూడా నటించారు. ఇక తాజాగా ఈయిన తన భార్య నుంచి విడాకులు తీసుకున్నట్లు వార్తలు వినిపించగా… రీసెంట్గా సోషల్ మీడియాలో కూడా తన అభిమానులతో చిట్ చాట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు.. చిట్ చాట్ లో భాగంగా ఒక అభిమాని.. వదిన బాగున్నారా అంటూ అడగగా.. దీనిపై స్పందించిన పవన్ సాయి.. నాతో ఎవరూ లేరు.. నేను ఒంటరి వాడిని.. అని సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు పవన్ సాయి.. దీంతో పవన్ మాటలు విన్న నెటిజెన్స్ అలాగే అభిమానులు పవన్ సాయి తన భార్య నుంచి దూరంగా ఉన్నారంటూ వార్తలు వైరల్ చేశారు.. అంతే కాదు ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం పవన్ సాయికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది.

పవన్ సాయి సీరియల్స్..
మొగలిరేకులు, నాగభైరవి , మల్లి , శ్రావణ సమీరాలు ముద్దుబిడ్డ, ముద్దమందారం వంటి సీరియల్స్ లో నటించి భారీ పాపులారిటీ దక్కించుకున్న పవన్ సాయి ముద్దమందారం సీరియల్ తోనే ఓవర్ నైట్ లో స్టార్ స్టేటస్ ని సొంతం చేసుకున్నారు.

- Advertisement -

పవన్ సాయి కెరియర్..
మొదటిసారి దర్శకురాలు మంజులా నాయుడు దర్శకత్వం వహించిన మొగలిరేకులు సీరియల్లో ప్రైమ్ టైం షోలు మాత్రమే చేశారు పవన్ సాయి.. ఆ తర్వాత 2021 అక్టోబర్లో ఆరోగ్య సమస్యల కారణంగా రెండు నెలల పాటు విరామం తీసుకుని.. తర్వాత మళ్లీ సీరియల్ కోసం అన్నపూర్ణ స్టూడియోస్ నుండి కాల్ రావడంతో కర్ర సహాయంతో అన్నపూర్ణ బృందాన్ని కలిశారట. ఇక నవంబర్లో జరిగిన ఫోటోషూట్ 2021 డిసెంబర్లో మల్లి సీరియల్ షూటింగ్ కి మార్గం సుగమం చేసింది అంటూ తెలిపారు.. యుక్త వయసులో తాను నటుడిగా మారడానికి ఎన్నో కలలు కన్నారట.. అందుకుగాను ఏడేళ్లు శ్రమించారట.. వారాంతాలలో సినిమా, టీవీ కార్యాలయాలు చుట్టూ తిరిగే వారట. ఇక అలా మొగలిరేకులు సీరియల్ లో ఒక చిన్న పాత్ర లభించిందని.. ఆ తర్వాత శ్రావణ సమీరాలు అంటూ పలు సీరియల్స్ లో అవకాశాలు రావడంతో తనదైన నటనతో చెరగని ముద్ర వేసుకున్నాను అంటూ తెలిపారు పవన్ సాయి.. అయితే ఇప్పుడు తన భార్యకు విడాకులు ఇచ్చారని తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.. మరి దీనికి కారణాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు