HBD Akhil: అఖిల్ కెరీర్.. సక్సెస్ కోసం తపన.. విజయం వరిస్తుందా..?

HBD Akhil: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు అక్కినేని అఖిల్.. ఇప్పటివరకు పలు చిత్రాలలో నటించారు కానీ ఒక్కటి కూడా కమర్షియల్ గా విజయాన్ని అందించలేదు… ఈ నేపథ్యంలోనే ఈసారి ఎలాగైనా సరే కమర్షియల్ హిట్ కొట్టాలనే నేపథ్యంతో ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అఖిల్ విఫలం అవుతున్నారనే చెప్పాలి.. ఇదిలా ఉండగా ఈరోజు అఖిల్ అక్కినేని పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ కెరియర్ ఎలా సాగుతోంది అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

అఖిల్ కెరియర్..
1995లో అఖిల్ మొదటిసారి సిసింద్రీ సినిమాలో కీలక పాత్ర పోషించారు.. ఒక సంవత్సరం బాలునిగా నటించి తన అద్భుతమైన నటనతో ఎంతోమందిని అబ్బురపరిచారు. తర్వాత బాలునిగా మరే చిత్రంలో కూడా నటించలేదు. సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటూ ఆస్ట్రేలియాలో చదువుని పూర్తి చేశాడు. పదహారవ ఏట నుండే సినీ ప్రస్థానంలో కి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న అఖిల్ .. తన తండ్రి కోరిక మేరకు బిజినెస్ మేనేజ్మెంట్లో చేరడానికి బదులు న్యూయార్క్ లోని లీ స్ట్రాస్ బెర్గ్ థియేటర్ అండ్ ఫిలిం ఇన్స్టిట్యూట్ లో నటనా కోర్సులో చేరారు.

అఖిల్ సినిమా జీవితం..
2014లో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో యుక్త వయసుకు వచ్చిన తర్వాత తొలి సారి మనం చిత్రంలో చివరి సన్నివేశంలో కనిపించాడు. ఇదే ఆయన సినిమా జీవితానికి లాభదాయకమయ్యింది. అలా వి.వి. వినాయక్ దర్శకత్వంలో 2015లో అఖిల్ అనే సినిమాతో హీరోగా ఇండస్ట్రీకి అడుగు పెట్టారు. సినీ బ్యాగ్రౌండ్తో సులభంగానే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. దీంతో విమర్శల పాలయ్యారు.. నెపోటిజం అనే పదం కూడా తెరపైకి వచ్చింది. అప్పట్లో ఎన్నో ఇబ్బందులు, అవమానాలు కూడా ఎదుర్కొన్నారు అఖిల్.. ఇక అంతే కాదు 2016లో జి నాగేశ్వర్రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఆటాడుకుందాం రా సినిమాలో అతిథి పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా కూడా పెద్దగా గుర్తింపును అందివ్వలేదు..

- Advertisement -

9 సంవత్సరాలుగా ఎదురుచూపు..
ఆ తర్వాత 2017లో హలో, 2019లో మిస్టర్ మజ్ను, 2021 లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, 2022లో ఏజెంట్ ఇలా పలు చిత్రాలలో నటించారు.. కానీ ఏ చిత్రం కూడా అఖిల్ కి ఇప్పటివరకు సరైన విజయాన్ని అందించలేదు. గత రెండేళ్ల క్రితం వచ్చిన ఏజెంట్ సినిమాతో ఎలాగైనా సరే కమర్షియల్ హిట్ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు.. కానీ ఈ సినిమా భారీ డిజాస్టర్ గా నిలిచింది. ఇక అప్పటివరకు భారీ ఆశలు పెట్టుకున్న అఖిల్ కి తీరని నిరాశే మిగిలిందని చెప్పవచ్చు. ఇక ఒక్క సక్సెస్ కోసం దాదాపు 9 సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న అఖిల్ కి ఈ ఏడాదైనా సక్సెస్ లభిస్తుందేమో చూడాలి.. ప్రస్తుతం మరే కొత్త సినిమా ప్రకటించని అఖిల్ ఈసారి ప్రేక్షకులకు రీచ్ అయ్యే కాన్సెప్ట్ తో ముందుకు రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు . మరి ఈసారైనా కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేయాలని.. అప్పుడే సక్సెస్ లభిస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.. మరి అఖిల్ తన కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అంటే కథపై దృష్టి పెట్టాలని అప్పుడే సక్సెస్ అవుతారని ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు