Mrunal Thakur Movie Roles : మృణాల్ కు మొదలైన బ్యాడ్ టైం… రోల్స్ దొరకట్లేదా?

Mrunal Thakur Movie Roles : టాలీవుడ్ లో చేసింది మూడు సినిమాలే అయినప్పటికీ విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ బ్యూటీ స్పీడ్ కు ఫ్యామిలీ స్టార్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. ఈ బ్యూటీకి అసలు పాత్రలే దొరకట్లేదా ఏంటి ? అనే అనుమానం వచ్చేలా చేసింది మృణాల్. మరి ఇంతకీ మృణాల్ ఏం చేసింది? అనే వివరాల్లోకి వెళ్తే…

మూడు సినిమాల్లో ఒకే రకమైన పాత్రలు…

టాలీవుడ్ లో మృణాల్ ఇప్పటిదాకా మూడు సినిమాల్లో హీరోయిన్ గా కనిపించింది. అయితే ఈ మూడు సినిమాల్లో కూడా ఆమె కావాలని చేసిందో, లేదంటే యాదృచ్ఛికమో తెలీదు గానీ ఒకే రకమైన పాత్రలు చేసింది. ఒక మధ్య తరగతి కుర్రాడి కోసం తపించే రిచ్ అమ్మాయిగా మృణాల్ నటించిన విషయం కాస్త గమనిస్తే ఎవరికైనా ఇట్టే అర్థమయిపోతుంది. అయితే ఒక్కో సినిమాలో ఆమె పర్ఫామెన్స్,, లుక్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ ఆమె చేసిన పాత్రల కోర్ మాత్రం అన్ని సినిమాలలో ఒకేలా ఉంది. సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్ సినిమాలలో సంపన్నమైన కుటుంబంలో జన్మించిన అమ్మాయిగా, ఒక సాధారణ వ్యక్తినీ లవ్ చేసే హీరోయిన్ గా కనిపించింది. నిజానికి మృనాల్ లో అందం, అభినయం పాళ్లు కాస్త ఎక్కువగానే ఉండడంతో ఆమె చేసిన ఈ చిన్న మిస్టేక్ ను ఇంకా జనాలు పెద్దగా గుర్తించలేదు. కానీ ఇప్పుడిప్పుడే ఈ బాలీవుడ్ భామ సేమ్ పాత్రలనే ఎంచుకుంటుంది అని విమర్శలు మొదలవుతున్నాయి. అవి తారస్థాయికి చేరుకోక ముందే మృణాల్ కళ్ళు తెరిస్తే మంచిది.

మృణాల్ కు రోల్స్ దొరకట్లేదా?

బ్యూటిఫుల్ హీరోయిన్ మృణాల్ నటించిన మూడు సినిమాల ప్రజెంటేషన్ చాలా వరకు మారడం వల్ల ఆమె ఒకే జోనర్ లో సినిమాలు చేయడం పట్ల ఇంకా జనాలకు విసుగు రాలేదు. కానీ ఓ వర్గం ఆడియన్స్ మాత్రం ఈ బ్యూటీకి అసలు టాలీవుడ్ లో రోల్స్ దొరకట్లేదా? ఎందుకని మూడు సినిమాల్లోను ఒకే రకమైన పాత్రలను ఎంచుకుంది? అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ మూవీతో పడ్డ స్పీడ్ బ్రేక్ తోనైనా మృణాల్ మరోసారి తన పాత్రల గురించి ఆలోచించుకుంటే బెటర్ అంటున్నారు అభిమానులు. ఆమె నెక్స్ట్ చేయబోయే సినిమాలోని పాత్రల ఎంపిక విషయంలో మృణాల్ జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మరికొన్ని సినిమాలతోనే ఈ బ్యూటీ మళ్లీ టాలీవుడ్ కు తిరిగి రాకుండా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ మూడు సినిమాల్లోనూ తన రియల్ లైఫ్ కు దగ్గరగా ఉండే పాత్రలనే పోషించానని మృణాల్ తనను తాను సమర్థించుకున్నప్పటికీ, ఆడియన్స్ మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. తాజాగా ఫ్యామిలీ స్టార్ తో వచ్చిన నెగిటివ్ టాక్ కారణంగా హ్యాట్రిక్ ను జస్ట్ మిస్ అయ్యింది మృణాల్. మరి ఇప్పటికైనా పాత్రల సెలక్షన్ విషయంలో మృణాల్ కేరింగ్ గా ఉంటుందా? అనేది చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు