Pawan Kalyan : ఇప్పుడైనా పూర్తి చేస్తాడా ?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టిస్తున్న తాజా సినిమా హ‌ర హ‌ర వీర‌మల్లు. ఈ చిత్రంలో నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. కీలక పాత్రలో జాక్వ‌లిన్ ఫెర్నాండెజ్ కనిపిస్తున్నట్లు సమాచారం. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు క్రిష్ పాన్ ఇండియా హిస్టారిక‌ల్ చిత్రంగా హ‌రిహ‌ర వీర‌మ‌ల్లును తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌న్‌ని వారియ‌ర్‌గా ఫ‌స్ట్ టైమ్ చూడ‌బోతున్న సినిమా ఇదే కావ‌డం విశేషం.

ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ లో తెర‌కెక్కిస్తుండ‌డంతో ఎక్కువ‌గా హిందీలో కూడా ఈ సినిమాకు మంచి ఆఫ‌ర్స్ వ‌స్తున్న‌ట్టు స‌మాచారం. మేక‌ర్స్ ఈ సినిమాని ప‌ర్‌ఫెక్ట్‌గా చెక్కిన‌ట్ట‌యితే డెఫినెట్‌గా ఈ సినిమా మంచి వసూళ్ల‌ను న‌మోదు చేయ‌డం ఖాయం అనే చెప్ప‌వ‌చ్చు. ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన ప‌వ‌న్ పోస్ట‌ర్లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ప‌వ‌న్‌ బ‌ర్త్ డే సంద‌ర్భంగా విడుద‌లైన ప‌వ‌ర్ గ్ల‌న్స్‌తో ఈ సినిమాకి పాన్ ఇండియా లెవ‌ల్‌లో భారీ ఆఫ‌ర్లు రావ‌డం మొద‌లైన‌ట్టు స‌మాచారం.

మ‌రోవైపు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజ‌కీయాల్లో చాలా బిజీగా ఉన్నారు. ప్ర‌ణాళిక ప్ర‌కారం.. ప‌వ‌న్ సినిమా, రాజ‌కీయాల కోసం స‌మ‌యం కేటాయిస్తున్న‌ట్టు స‌న్నిహితులు చెబుతున్నారు. పొలిటిక‌ల్ గా బిజీగా ఉండ‌డంతోనే సినిమాలు కాస్త ఆల‌స్యం అవుతున్నాయ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం 50 శాతం షూట్ పూర్తి చేసుకుంది. డైరెక్ట‌ర్ క్రిష్ తాజా షెడ్యూల్ ప్ర‌కారం అక్టోబ‌ర్ రెండో వారంలో షూట్ ప్రారంభం కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రంలో ప‌వ‌న్ రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టించిన ఈ సినిమా పాన్ ఇండియా లెవ‌ల్ లో ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాలి మ‌రి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు