Kajal : తిరిగొచ్చింది

సౌత్ ఇండియా స్టార్ హీరో కమల్ హాసన్ ఇటీవల విక్రమ్ సినిమాతో ఎంత పెద్ద హిట్ కొట్టాడో అందరికీ తెలుసు. పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కమల్ హాసన్ కు ఉన్న అప్పులను మొత్తం తీర్చింది. దీని తర్వాత సినిమాలపై కమల్ హాసన్ ఎక్కువ ఫోకస్ చేశారు. కాగా ప్రస్తుతం ఈయన మధ్యలో ఆగిపోయిన ఇండియన్ – 2 చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే ఆర్సీ 15 షూటింగ్ లో ఉన్న దర్శకుడు శంకర్ ను ఇండియన్ -2 ను రీ స్టార్ట్ చేయడానికి తీసుకువచ్చారు.

ఈ సినిమా షూటింగ్ ఇటీవల గ్రాండ్ గా ప్రారంభమైంది. ఒక షెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది. కొత్త షెడ్యూల్ తాజాగా ప్రారంభమైందని తెలుస్తుంది. ఈ కొత్త షెడ్యూల్ లో కాజల్ అగర్వాల్, కమల్ హాసన్ పై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం అందుతుంది. ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే డైరెక్టర్ శంకర్ తిరిగి ఆర్సీ 15 సెట్స్ పైకి వెళ్తారని టాక్ వినిపిస్తోంది. కాగా ఆర్సీ 15, ఇండియన్ -2 సినిమా షూటింగ్స్ ను ఏక కాలంలో తీస్తానని డైరెక్టర్ శంకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే కాజల్ అగర్వాల్ చాలా రోజుల గ్యాప్ తర్వాత తిరిగి కెమెరా ముందుకు వచ్చింది. 2020లో గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న తర్వాత కాజల్ మెల్ల మెల్లగా ఇండస్ట్రీ దూరంగా ఉంది. తర్వాత కాజల్ ప్రెగ్నెన్సీ కావడంతో సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆచార్య, ఘోస్ట్ సినిమాలను కూడా వదులుకుంది. తాజాగా ఇప్పుడు ఇండియన్ -2 ద్వారా ప్రేక్షకుల ముందకు రాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు