Samantha : నిజామా.. పుకారా ?

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది సమంత. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సామ్, కొన్ని రోజుల్లోనే స్టార్ డమ్ తెచ్చుకుంది. హీరో అక్కినేని నాగ చైతన్య ను వివాహం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత అధికారికంగా వీడిపోయారు. డైవర్స్ తర్వాత కూడా సమంత వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లో ఉంది. ప్రస్తుతం సామ్ ఒక టాలీవుడ్ లోనే కాదు.. కోలీవుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తోంది.

అయితే గత కొద్ది రోజుల నుండి సమంతకు సంబంధించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సమంత కొన్ని రోజుల నుండి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతుందని ఈ వార్తల సారాంశం ఆమె చర్మ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుందని నెట్టింట్లో వార్తలు వచ్చాయి. అంతే కాదు.. దీని కోసం సామ్ సర్జరీ కూడా చేసుకుంటుందని అంటున్నారు. అందుకోసం ఆమె అమెరికా వెళ్లినట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే విజయ్ దేవరకొండతో తెరకెక్కుతున్న ఖుషి సినిమా షూటింగ్ వాయిదా పడిందని అంటున్నారు.

సర్జరీ తర్వాత కొద్ది రోజులు రెస్ట్ తీసుకుని తిరిగి షూటింగ్ కు వస్తారని రూమర్స్ వస్తున్నాయి. దీంతో సామ్ అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియక కలవరపడుతున్నారు. ఈ రూమర్స్ కు బ్రేక్ వేయాలంటే, తమ అభిమాన నటి సమంత నోరు విప్పాల్సిందే అని అంటున్నారు. అయితే సామ్ కొద్ది రోజుల నుండి సోషల్ మీడియాలో కానీ, బయట గానీ ఎక్కువగా కనిపించడం లేదు. ఇది ఇప్పటి వరకు వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు