Parineeti Chopra: తప్పుడు వ్యక్తులను నమ్మి మోసపోయాను..!

Parineeti Chopra.. ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నా .. ఈ మధ్యకాలంలో సరైన హిట్ అందుకోలేక సతమతమవుతోంది ఈ ముద్దుగుమ్మ. ఈ క్రమంలోనే తాజాగా “అమర్ సింగ్ చమ్కిలా” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా నెట్ ఫ్లిక్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇందులో చమ్కిలా పాత్రలో దిల్జిత్ దోసాంజ్ ఆకట్టుకుంటే.. ఇంకొక వైపు పరిణీతి చోప్రా కూడా తన నటనతో ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా కోసం ఏకంగా 15 కిలోల బరువు కూడా పెరిగింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఈమె మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకుంది..

Parineeti Chopra:I got cheated by trusting wrong people..!
Parineeti Chopra:I got cheated by trusting wrong people..!

తప్పుడు వ్యక్తులను నమ్మడమే ప్రధాన కారణం..

ఇదిలా ఉండగా పరిణీతి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో విషయాలను పంచుకుంది.. అందులో భాగంగానే ఆమె తప్పుడు మనుషులను నమ్మకూడదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంటర్వ్యూలో భాగంగా పరిణీతి చోప్రా మాట్లాడుతూ.. చాలామంది నాకు తప్పుడు సలహాలు ఇచ్చారు.. అవి విన్నాక అప్పట్లో కరెక్ట్ అనిపించి ఎన్నో సినిమాలు చేశాను.. కానీ నాకు ఆ సమయంలో ఇండస్ట్రీ గురించి పెద్దగా అవగాహన లేకపోవడమే దీనికి కారణం.. దీంతో ఎన్నో పొరపాట్లు జరిగిపోయాయి .. నేడు వాటి ఫలితాన్ని ఎదుర్కొంటున్నాను.. చెప్పిన మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకొని నేడు నా జీవితాన్ని నాశనం చేసుకున్నాను.. తప్పుడు మనుషులను నమ్మడం కంటే మనసులోని మాటను విని ఉంటే బహుశా నా కెరియర్లో ఇటువంటి పొరపాట్లు తక్కువగా జరిగి ఉండేవేమో.. అయితే ఆ సమయంలో సినిమాల ఎంపికలో ట్రెండ్స్ ని ఫాలో అవ్వమని చెప్పేవారు చాలా తక్కువ.. సినీ పరిశ్రమ గురించి నాకు ఏమైనా తెలిసి ఉంటే ఇంత మంది మాటలు వినాల్సిన అవసరం ఉండేది కాదేమో అంటూ చెప్పుకొచ్చింది పరిణీతి..

ఎంపిక విషయంలో పరిపక్వత..

ఆ తర్వాత ఏం చేయాలో ఇప్పుడు అర్థమయింది.. నాకు పని ఇచ్చే దర్శకులు, నిర్మాతలు నాకు కావాలి. ఇదే సమయంలో తన తప్పులను చూసి కాకుండా.. తన ప్రతిభను చూసి మాత్రమే సినిమా అవకాశాలు ఇవ్వాలి అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ.. ఇక ఇది విన్న అభిమానులు, నెటిజన్ లు ఆశ్చర్యపోతున్నారు.. సోదరి ప్రియాంక చోప్రా సక్సెస్ ఫుల్ గా రాణించింది కానీ పరిణీతి చోప్రాకు మాత్రం ఎటువంటి సలహాలు ఇవ్వలేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి దీనిపై ప్రియాంక చోప్రా ఏదైనా స్పందిస్తుందా అనే విషయంపై అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..

- Advertisement -

ప్రియాంక చోప్రా..

పరిణీతి చోప్రా సోదరి ప్రియాంక చోప్రా విషయానికి వస్తే.. ఈమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్.. అంతేకాదు అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ కూడా.. ఇప్పుడిప్పుడే హాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.. కెరియర్ లో ఇంత సక్సెస్ ను చూసిన ఈమె తన సోదరీ పరిణీతి చోప్రా కెరియర్ కు ఎందుకు ఉపయోగపడలేదు అనే ప్రశ్న అందరి మది లో మెదులుతోంది.. మరి దీనిపై ఈ అక్కాచెల్లెళ్లు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు