Nayattu Dubbing version on Aha : కోట బొమ్మాళి ఒరిజినల్ వెర్షన్ ఓటిటిలోకి… రీమేక్ వచ్చాక పేరు మార్చి రిలీజ్

Nayattu Dubbing version on Aha : కొంతకాలం క్రితం రిలీజై హిట్ గా నిలిచిన కోటబొమ్మాలి మూవీ ఒరిజినల్ వెర్షన్ ను ఆహాలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఆల్రెడీ రీమేక్ అయిన మూవీ ఒరిజినల్ కు పేరు మార్చి, డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తుండడం విశేషం. మరి కోటబొమ్మాలి మూవీ ఒరిజినల్ వెర్షన్ ఏ పేరుతో ఆహాలొ ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది? అనే వివరాల్లోకి వెళ్తే…

సూపర్ హిట్ మలయాళం మూవీ నాయట్టు 2001లో లాక్డౌన్ టైంలో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ అయింది. అందులో కుంచాకో బోబన్, నిమిషా సజయన్, బోజూ జార్జ్ ప్రధాన పాత్రను పోషించగా, ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. కథ సింపుల్ గానే ఉన్నప్పటికీ మంచి కథనం, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. మార్టిన్ ప్రకాష్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, ఇప్పుడు డబ్బింగ్ వెర్షన్ తో ఆహాలో రిలీజ్ కు రెడీ అవుతుంది.

ఓటీటీలో, థియేటర్లలో కోట బొమ్మాళిగా..

నాయట్టు మూవీ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న జిఏ 2 సంస్థ తేజ మార్ని దర్శకత్వంలో కోట బొమ్మాలి పేరుతో తెరకెక్కించి, తెలుగులో రిలీజ్ చేసింది. అందులో శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలు పోషించగా, 2023 నవంబర్ 24న రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది కోట బొమ్మాలి పీఎస్ మూవీ. నిజానికి అప్పట్లోనే ఆల్రెడీ ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీని మళ్లీ రీమేక్ చేస్తే ఎవరు చూస్తారు అనే టాక్ నడిచింది. కానీ రీమేక్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తేజ మార్ని ఆ మూవీలో మార్పులు చేర్పులు చేసి తెరపైకి తీసుకొచ్చారు. అలాగే ఆయన టేకింగ్ కూడా బాగుండడంతో సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చిన కోట బొమ్మాలి మూవీ నిర్మాతలకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఇప్పటికే కోట బొమ్మాలి మూవీ ఓటిటిలో సందడి చేస్తుండగా, నెక్స్ట్ వీక్ ఈ మూవీ ఒరిజినల్ వెర్షన్ ను ఆహాలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఒరిజినల్ సినిమాకి తెలుగు డబ్బింగ్ చెప్పించి రిలీజ్ చేస్తుండడం గమనార్హం.

- Advertisement -

ఎప్పుడు స్ట్రీమింగ్ అంటే..

ఆహా ఓటిటిలో రిలీజ్ కాబోతున్న నాయట్టు మూవీ డబ్బింగ్ వెర్షన్ కు చుండూరు పోలీస్ స్టేషన్ అనే టైటిల్ ను ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఏప్రిల్ 26 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఆల్రెడీ రీమేక్ వెర్షన్ రావడం హిట్ అవ్వడం, ఆ తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం కూడా జరిగిపోయింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఒరిజినల్ వెర్షన్ కు టైటిల్ మార్చి ఆహాలో రిలీజ్ చేస్తుండడంతో ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

స్టోరీ విషయానికి వస్తే.. పొలిటికల్ లీడర్స్ తమ స్వార్థం కోసం ఓటు బ్యాంకును ఎలా ఉపయోగించుకుంటారు? ప్రభుత్వం, పొలిటికల్ లీడర్స్ వ్యవస్థను తమ స్వార్థం కోసం ఎలా ఉపయోగించుకుంటారు? అత్యవసర పరిస్థితుల్లో వాళ్లను ఎలా బలి పశువులను చేస్తారు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ సినిమాలో చూపించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు