Secrets of The Octopus on OTT : ఆక్టోపస్ సీక్రెట్స్ బయటపెట్టే జేమ్స్ కామెరూన్ కొత్త సిరీస్… ఏ ఓటిటిలో ఉందంటే?

Secrets of The Octopus on OTT : హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ గా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించిన డాక్యుమెంటరీ సిరీస్ సీక్రెట్స్ అఫ్ ది ఆక్టోపస్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. మరి ఆ సిరీస్ విశేషాలు ఏంటో తెలుసుకుందాం.

ఇద్దరు డైరెక్టర్స్..

అవతార్ ఫేమ్ జేమ్స్ కామెరూన్ డైరెక్టర్ డైరెక్టర్ గా వ్యవహరించిన డాక్యుమెంటరీ సిరీస్ ది సీక్రెట్స్ అఫ్ ది ఆక్టోపస్ పేరుతో పెరుకెక్కింది. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కోసం జేమ్స్ రూపొందించిన ఈ డాక్యుమెంటరీ సిరీస్ తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోకి వచ్చేసింది. అయితే ఈ సిరీస్ కు జేమ్స్ కామెరూన్ మాత్రమే కాకుండా ఆడం గీగర్ కూడా దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సిరీస్ కు డైరెక్టర్ గా  ఆడం గీగర్ పేరే ఉండడం విశేషం. ఎందుకంటే జేమ్స్ కామెరూన్ ఈ సిరీస్ లోని కొన్ని ఎపిసోడ్ లకు మాత్రమే దర్శకత్వం వహించడంతో పాటు ఆయన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరించారు. ఇక ఈ సిరీస్ కు హాలీవుడ్ యాక్టర్ పాల్ రుడ్ నరేటర్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సిరీస్ మొత్తం ఆయన వాయిస్ లోనే సాగుతుంది. ప్రస్తుతం ఇంగ్లీష్ లో పాటు పలు భారతీయ భాషల్లో ఈ సిరీస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

దేని గురించి ఈ సీక్రెట్ ఆఫ్ ది ఆక్టోపస్?

ది సీక్రెట్ ఆఫ్ ది ఆక్టోపస్ సిరీస్ సముద్ర జలాల్లో అట్టడుగున నివసించే పలు జీవులకు సంబంధించిన విశేషాల్ని తెలియచెప్పే డాక్యుమెంటరీ సిరీస్. టైటిల్ లో ఉన్నట్టుగానే ఆక్టోపస్ లాంటి వింత జీవులకు సంబంధించిన పలు డీటెయిల్స్ ను ఇందులో వెల్లడించారు. ముఖ్యంగా ఏలియన్ క్రియేచర్ అని పిలుచుకునే ఆక్టోపస్ ల మిస్టరీలను మరింత డీటెయిల్ గా ఈ సిరీస్ లో బయట పెట్టారు.

- Advertisement -

జేమ్స్ కామెరూన్ సిరీస్ లు

గతంలో కూడా జేమ్స్ కామెరూన్ ఇలాంటి పలు సిరీస్ లను రూపొందించారు. ఆ డాక్యుమెంటరీ సిరీస్ లు  సీక్రెట్స్ అఫ్ ది ఎలిఫెంట్, సీక్రెట్స్ అఫ్ ది వేల్స్ పేరుతో వచ్చాయి. తాజాగా ఆయన ది సీక్రెట్ ఆఫ్ ది ఆక్టోపస్ సిరీస్ ను తెరకెక్కించారు.

అవతార్ 3. 4 త్వరలో..

అవతార్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా డైరెక్టర్ గా మంచి పేరు సంపాదించుకున్న జేమ్స్ అవతార్ 2 మూవీ తో 2022 లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మూడు నాలుగు సీక్వెల్స్ ను తెరపైకి తీసుకువచ్చే పనిలో ఉన్నారు. అవతార్ 3, అవతార్ 4 షూటింగ్ లతో జేమ్స్ కామెరూన్ బిజీ బిజీగా గడిపేస్తున్నారు.

ఇప్పటికే మూడో పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతున్న ఈ మూవీ ప్రొడక్షన్ కే రెండేళ్ల సమయం పడుతుందని టాక్ నడుస్తోంది. కాగా అవతార్ 3 మూవీ 2025 డిసెంబర్ 19న రిలీజ్ కాబోతుందని ఇప్పటికే అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మరోవైపు అవతార్ 4 షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ మూవీని 2029లో రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు