NTR Car No: 9999 కాదు 1422.. ఎట్టకేలకు మిస్టరీ వీడిందిగా..!

NTR Car No.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ను చూస్తే వెంటనే చక్కని స్మైలింగ్ ఫేస్.. నడక, నటన గుర్తుకొస్తాయి.. ముఖ్యంగా ఆయన పేరు చెప్పగానే సహాయం చేసే గుణం బయటపడుతుంది.. ఇక ఇవే కాకుండా ఎన్టీఆర్ ను చూస్తే మనకు గుర్తొచ్చే ఒకే ఒకటి కార్ నంబర్.. 9999 అనే ఫ్యాన్సీ కార్ నెంబర్ కూడా మనకు గుర్తుకొస్తుంది.. ముఖ్యంగా ఎన్టీఆర్ ఏ కారు తీసుకున్నా సరే దానికి 9999 అనే సీరీస్ కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా ఎన్టీఆర్ అభిమానులు హైదరాబాద్ రోడ్ల పైన 9999 అనే నంబర్ కార్ ను చూశారు అంటే కచ్చితంగా అందులో ఎన్టీఆర్ ఉన్నారా అంటూ తొంగి చూస్తారు.. అంతలా ఈ నెంబర్ హైదరాబాదు రోడ్లపై ఫేమస్ అయ్యింది.. అయితే తాజాగా ఈ సీరీస్ ను కాదని కొత్త సీరీస్ ని తీసుకున్నట్లు సమాచారం..

NTR Car No:9999 not 1422.. Finally the mystery is solved..!
NTR Car No:9999 not 1422.. Finally the mystery is solved..!

9999 కాదు 1422:

ముఖ్యంగా ఎన్టీఆర్ కి కార్లంటే చాలా ఇష్టం.. మార్కెట్లోకి ఏదైనా ఒక వినూత్నమైన.. అధునాతన ఫీచర్స్ తో కూడిన కారు వచ్చిందంటే కచ్చితంగా.. ఆ కార్ తన గ్యారేజ్ లో ఉండాల్సిందే.. లక్షలు అయినా కోట్లు అయినా ఖర్చు చేసి వాటిని సొంతం చేసుకుంటూ ఉంటారు.. అంతేకాదు ఆయన కారుకి పెట్టే ఫ్యాన్సీ నెంబర్ కోసం కూడా లక్షల్లో ఖర్చు చేస్తూ ఉంటారు.ఇదిలా ఉండగా తాజాగా రూ.లక్షలు ఖర్చుచేసి కొనుగోలు చేసే ఈ కార్ నెంబర్ ను ఎన్టీఆర్ మార్చినట్లు తెలుస్తోంది.. తాజాగా ఎన్టీఆర్ ఎంతో ఇష్టపడి బెంజ్ కారును కొనుగోలు చేశారు.. అయితే ఈ కారు తాజాగా హైదరాబాదు రోడ్లపైకి రాగా.. ఈ కారు పైన 9999 కాకుండా 1422 నంబర్ కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఎందుకు నంబర్ మార్చారు.. పైగా ఫ్యాన్సీ నెంబర్ కూడా కాదు.. ఇప్పుడు ఇలాంటి నంబర్ ను తీసుకున్నాడు ఏంటి అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి ఎన్టీఆర్ తన బెంజ్ కార్ నేమ్ ప్లేట్ కి 9999 కాదని 1422 అని పేరు పెట్టడం వెనుక అసలు కారణం ఇదేనట.. మరి అది ఏంటో ఇప్పుడు చూద్దాం..

1422 మిస్టరీ వీడింది..

ఇకపోతే ఎన్టీఆర్ 9999 అనే నెంబర్ ని కాకుండా 1422 అనే నెంబర్ ఎంచుకోవడం వెనుక అసలు కారణం తన కుమారుల పుట్టినరోజు తేదీలను బట్టి తీసుకున్నారని సమాచారం.. ముఖ్యంగా ఇద్దరి కొడుకుల బర్తడే డేట్ వచ్చేలా ఇలా 1422 అనే నంబర్ ను నెంబర్ ప్లేట్ గా పెట్టుకున్నారట.. నిజానికి ఎన్టీఆర్ పెద్ద కుమారుడు అభయ్ రామ్ జూలై 22 2014న జన్మించగా.. భార్గవ్ రామ్ జూన్ 14 2018లో జన్మించారు ..ఇప్పుడు వీళ్ళిద్దరి పుట్టినరోజు తేదీలను కలిసి వచ్చే విధంగా జూనియర్ ఎన్టీఆర్ తన కొత్త బెంజ్ కారుకి ఈ సిరీస్ ని తీసుకున్నట్లు సమాచారం.. ఇకపోతే దీన్ని బట్టి చూస్తే సరైన రీజన్ ఇదే అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.కానీ దీనిపై ఇంకా ఎన్టీఆర్ ఎటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. మరి ఎన్టీఆర్ తదుపరి కార్ లకు కూడా ఇదే సీరీస్ ను కొనసాగిస్తారా లేక బెంజ్ కార్ కి మాత్రమే ఈ సిరీస్ ఉంటుందా అన్నది తెలియాల్సి ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు