Vettiyan Vs Coolie : వెట్టాయన్ కంప్లీట్ కాకముందే కూలీ షూటింగ్… కూలీ ఎప్పుడు పెట్టాలెక్కుతున్నాడు అంటే…?

Vettiyan Vs Coolie : సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ వయసులో కూడా యమా స్పీడ్ గా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం వెట్టాయన్, కూలీ అనే రెండు భారీ బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నారు ఆయన. అయితే తాజా సమాచారం ప్రకారం రజినీ ఇప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన వెట్టాయన్ షూటింగ్ పూర్తి కాకముందే నెక్స్ట్ మూవీ కూలీని పట్టాలెక్కించబోతున్నారు. మరి ఇంతకీ కూలీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లబోతోంది అంటే…

కూలీ సెట్స్ పైకి ఎప్పుడంటే?

రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టాయన్ మూవీ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. మరో 70 రోజుల పాటు ఎలాంటి అడ్డంకులు లేకుండా నిర్విరామంగా షూటింగ్ జరిగితే వెట్టాయన్ షూటింగ్ పూర్తవుతుంది. కానీ అంతలోపే కూలీ షూటింగ్ ను కూడా మొదలు పెట్టబోతున్నారు రజినీ. ఫిల్మ్ వర్గాల టాక్ ప్రకారం కూలీ మూవీ జూన్ లో సెట్స్ పైకి వెళ్లబోతోంది అని తెలుస్తోంది. అంటే రజినీకాంత్ కొన్ని రోజుల పాటు గ్యాప్ లేకుండా రెండు సినిమాల షూటింగ్ ను చేయాల్సి ఉంటుంది.

రియల్ స్టోరీ ఆధారంగా వెట్టాయన్

రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్న మూవీ వెట్టాయన్. ఈ ఏడాది అక్టోబర్‌లో సినిమా థియేటర్లలోకి రానుంది. మలయాళీ స్టార్ ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఆయన మాత్రమే కాదు అమితాబ్ బచ్చన్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ కూడా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

- Advertisement -

వెట్టాయన్ వాస్తవ కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం. రీసెంట్ గా పది రోజుల పాటు తిరువనంతపురంలో ఈ మూవీ షూటింగ్ జరిగింది. అక్కడ రజనీకాంత్ సినిమా షూటింగ్ జరగడం ఇదే తొలిసారి. ఇక ఆ షెడ్యూల్ లో రజినీకాంత్, ఫహద్ ఫాజిల్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. 30 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌, అమితాబ్‌ బచ్చన్‌ కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం మరో విశేషం. ఈ బిగ్ స్టార్స్ చివరిసారిగా హమ్ (1991) అనే హిందీ మూవీలో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు.

కూలీ టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్

రజినీకాంత్ 70వ మూవీ వెట్టాయన్ తరువాత ఆయన చేయబోతున్న మూవీ కూలీ. ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, సన్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. అన్పరివు స్టంట్ డైరెక్టర్లుగా పని చేస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న కూలీ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సన్ పిక్చర్స్ తాజాగా ఈ సినిమా టైటిల్‌ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసింది. దానికి ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క టైటిల్ టీజర్ కారణంగా ఇంకా సెట్స్ పైకి వెళ్లక ముందే కూలీపై అంచనాలు పెరిగిపోయాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు