Nbk109: బాలయ్య సినిమాలో బాలీవుడ్ విలన్ ?

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హిందూపురం ఎమ్మెల్యేగా, అలాగే టాలీవుడ్ సీనియర్ హీరోగా తన కెరీర్ కొనసాగిస్తున్నారు నందమూరి బాలయ్య. నందమూరి తారక రామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకొని టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు నందమూరి బాలయ్య.

తన కొడుకు హీరో ఏజ్ కు వచ్చినప్పటికీ కూడా బాలయ్య క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పవచ్చు. అంతేకాదు ఏడాదికి రెండు సినిమాలు హిట్ కొట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు బాలయ్య. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్న బాలయ్య మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అనిల్ రావిపూడి మరియు బాలయ్య కాంబినేషన్లో ఎన్.బి.కె 109 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా నుంచి తాజాగా క్రేజీ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు బాబీ డియోల్ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు అనిల్ రావిపూడి తో బాబీ డియోల్ఉన్న ఫోటోను షేర్ చేసింది చిత్రం బృందం. అయితే బాలయ్య సినిమాలో విలన్ గా బాబీ డియోల్ కనిపించడం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. కాగా బాబి డియోల్ మొన్న రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు