Sreeleela with Ajith :హమ్మయ్య అజిత్ తో అగ్లీగా కాదు… ఊపిరి పీల్చుకుంటున్న శ్రీలీల ఫ్యాన్స్

Sreeleela with Ajith : యంగ్ బ్యూటీ శ్రీలీల నెక్స్ట్ మూవీ గురించి ఓ వార్త సోషల్ మీడియాను కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ సీనియర్ హీరో అజిత్ కొత్త మూవీ శ్రీలీల హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది అన్నదే ఆ వార్తల సారాంశం. అయితే ఈ విషయంలో శ్రీలీలపై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆమె తీసుకున్నది అగ్లీ డెసిషన్ కాదు అని మరో టాక్ మొదలైంది.

అసలు విషయం ఏమిటంటే..

అజిత్ లాంటి సీనియర్ హీరో సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుంది అనే వార్తను ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆల్రెడీ టాలీవుడ్ లో ఎగసి పడిన కెరటంలా మారింది శ్రీలీల పరిస్థితి. ఇలాంటి టైంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలతో యంగ్ హీరోల సరసన రొమాన్స్ చేయొచ్చు గానీ ఇలా సీనియర్ హీరోలకు జోడిగా నటించడం ఏంటి? అంటూ శ్రీలీలపై ట్రోలింగ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కోలీవుడ్ లో నడుస్తున్న టాక్ ప్రకారం అజిత్ మూవీలో శ్రీలీల పాత్ర అందరూ అనుకుంటున్నట్టుగా కాకుండా డిఫరెంట్ గా ఉంటుందట.

భగవంత్ కేసరి సినిమాలో శ్రీలీల బాలయ్యతో కలిసి యాక్ట్ చేసిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు అజిత్ మూవీలో కూడా శ్రీలీల పాత్ర దాదాపుగా అలాగే ఉంటుందని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇలా టాక్ రావడానికి రీజన్ అజిత్ కూడా.

- Advertisement -

అజిత్ అలాంటి వాడు కాదు

నిజానికి అజిత్ శ్రీలీల లాంటి యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి అస్సలు ఇష్టపడడు. అందుకే చిన్న ఏజ్ ఉన్న హీరోయిన్లను తన సినిమాలోకి తీసుకోడు. సీనియర్ హీరోయిన్ల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతాడు ఈ హీరో. అయితే అక్కడ కూడా రొమాన్స్ కు ఛాన్స్ వుండే స్టోరీలను పక్కన పెట్టి తన వయసుకు ప్రాధాన్యత ఉన్న మంచి పాత్రలు చేయడానికి మాత్రమే అజిత్ ఇష్టపడతాడు. ఇక ఆయన తాజా మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ మూవీలో కూడా అజిత్ పాత్ర అలాగే ఉంటుందని సమాచారం. దానికి తగ్గట్టుగానే శ్రీలీల పాత్ర కూడా ఏమాత్రం గ్లామర్ టచ్ అనేదే లేకుండా ఉంటుందని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఈ వార్తలు గనక నిజమైతే శ్రీలీలకు కోలీవుడ్లో స్ట్రాంగ్ డెబ్యూ వచ్చినట్టే అని అంటున్నారు.

శ్రీలీల ఫ్యాన్ హ్యాపీ..

ప్రస్తుతం శ్రీలీల పరిస్థితి టాలీవుడ్ లో ఏమాత్రం బాగాలేదు. ఆమె నటించిన గత చిత్రాలు ఆదికేశవ, ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలు డిజాస్టర్ గా నిలవగా, గుంటూరు కారం మూవీ కూడా తీవ్రమైన నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. గుంటూరు కారం తర్వాత స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తుంది అనుకున్న శ్రీలీల ఆ మూవీకి వచ్చిన రిజల్ట్ కారణంగా సైలెంట్ గా సైడ్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ వైపు చూస్తోంది అనే రూమర్లు నడుస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే అజిత్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా ఎంపికైంది అనే వార్త బయటకు వచ్చింది. అజిత్ కు కూతురులా ఉంటుందనే విమర్శలు నడుస్తున్న నేపథ్యంలోనే ఈ సినిమాలో తన పాత్ర డిఫరెంట్ గా ఉంటుందని, ఆమె తీసుకున్నది అగ్లీ డెసిషన్ కాదని అంటుంది కోలీవుడ్. ఈ న్యూస్ చూశాక శ్రీలీల ఫ్యాన్స్ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు