Teaser Talk: పారిజాతపర్వం టీజర్.. కిడ్నాప్ ఈజ్ ఆన్ ఆర్ట్!

యూట్యూబ్ స్టార్ చైతన్య రావు వరుస సినిమా ఆఫర్లతో దూసుకుపోతున్నాడు. అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమాతో హీరోగా మారిన చైతన్య, లేటెస్ట్ గా తరుణ్ భాస్కర్ తీసిన కీడా కోలా తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తాజాగా చైతన్య రావు హీరోగా నటిస్తున్న మరో సినిమా “పారిజాతపర్వం”. కాసేపటిక్రితమే రిలీజ్ అయిన ఈ సినిమా కాన్సెప్ట్ టీజర్ సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతుంది.

పారిజాతపర్వం అంటూ రిలీజ్ చేసిన ఈ టీజర్ చూడగా, టీజర్ లో డైరెక్ట్ గా కిడ్నాప్ నే ప్రధానాంశం గా చూపిస్తూ, దాని చుట్టూ కథని అల్లినట్టు తెలుస్తుంది. అయితే కామెడీ ప్రధానంగా తెరకెక్కుతున్న పారిజాతపర్వం లో కీలక పాత్రల్లో సునీల్, శ్రద్ధా దాస్ తో పాటు, హర్ష చెముడు, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి కూడా నటిస్తున్నారు.

- Advertisement -

ఇక పారిజాతపర్వం అని పారిజాతాపహరణం అంటే దొంగతనం లాంటిదే అని టైటిల్ లోనే అర్ధం వచ్చేట్టు డైరెక్టర్ చెప్పడం బాగుంది. టీజర్ లో ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా సినిమాపై ఆసక్తిని పెంచారని చెప్పొచ్చు.

ఇక ఈ సినిమాని వనమాలీ క్రియేషన్స్ లో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తుండగా, సంతోష్ కంభంపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. “రీ” సంగీతం సమకూరుస్తున్నాడు. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి లో పారిజాతపర్వం సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు