Operation valentine : దాంతోనే ఫైనల్ గా ఒక ఐడియా వస్తుంది?

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన “ఆపరేషన్ వాలెంటైన్” సినిమా మార్చ్ 1న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, భారత ఎయిర్ ఫోర్స్ ఆర్మీ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలిసిందే. మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ గాని, పాటలు గాని మంచి రెస్పాన్స్ తెచ్చుకుని మెప్పిస్తున్నాయి. అయితే చాలా సార్లు వాయిదా పడడం వల్ల ఆపరేషన్ వాలెంటైన్ సినిమాపై ఉన్నక్రేజ్ కాస్త తగ్గిందన్న మాట వాస్తవం.

అందుకే మూవీ ప్రమోషన్లపై మేకర్స్ బాగా దృష్టి పెట్టారు. దీనికోసమే వరుణ్ తేజ్ బాలీవుడ్ ముంబై కి వెళ్లి హిందీలో దాదాపు నాలుగు రోజుల పాటు పాతిక ఇంటర్వ్యూ లు ఇవ్వగా, రీసెంట్ గా కాశ్మీర్ వెళ్లి పుల్వామా అటాక్ జరిగిన చోటుకి వెళ్లి సైనికులకు నివాళులు అర్పించారు. ఇక తాజాగా హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీ కి వెళ్లి ప్రమోట్ చేసారు వరుణ్ తేజ్ అండ్ టీం.

- Advertisement -

ఇక ఆపరేషన్ వాలెంటైన్ నుండి ఫైనల్ ప్రమోషన్ కి పెద్ద అస్త్రం ట్రైలర్. ఈ ట్రైలర్ ఎప్పుడొస్తుందో తాజాగా మేకర్స్ అప్డేట్ చేసారు. తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేసి ఆపరేషన్ వాలెంటైన్ ఫస్ట్ స్ట్రైక్ అప్డేట్ రేపే చెపున్నామని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఇక సినిమా రిలీజ్ కి రెండు వారలు టైం కూడా లేదు కాబట్టి మరో రెండు మూడు రోజుల్లో ట్రైలర్ ని రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అయితే ట్రైలర్ లోనే అసలు విషయం అంతా ఉండేది. దాన్ని బట్టే సినిమాలో ఎంత విషయముంది, ఎంత వరకూ సినిమా ఆకట్టుకుంటుందో ఒక అంచనా వేయగలరు, సినిమాకి అసలు హైప్ కూడా అక్కడినుండి డిసైడ్ అవుతుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు