Pawan kalyan : ‘ఓజి’ కి PK ఇన్నిరోజులొస్తే చాలట?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న “ఓజి” సినిమా సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సాహో ఫేమ్ సుజీత్ ఈ సినిమాకోసం చాలా కష్టపడుతున్నాడు. దాదాపు నాలుగేళ్ళ పాటు స్క్రిప్ట్ రెడీ చేయగా ఏడాది కాలంగా షూట్ చేస్తున్నాడు. పైగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పీకే చేస్తున్న అన్ని సినిమాల్లో ఓజి సినిమా గురించే ఎక్కువ ఎదురుచూస్తున్నారంటే ఈ సినిమా పై ఏ రేంజ్ అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తుండగా, కోలీవుడ్ నుండి కూడా ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ పవన్ లేకుండా కూడా కొన్ని సీన్లు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా నుండి తాజాగా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ఓజి కి మరో రెండు వారాలు డేట్ లు ఇస్తే చాలు సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిపోతుందట. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 80 శాతం శాతం పూర్తయిపోయింది సుజీత్ కూడా పలుమార్లు చెప్పాడు. ఇక డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. పైగా థమన్ ఇచ్చిన బీజీఎమ్ తో ఓజి టీజర్ కి వచ్చిన రెస్పాన్స్ మామూలుగా లేదు.

ఇక పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్స్ ఉన్నా కూడా ఈ సినిమాకు మాత్రం సమయం కేటాయిద్దామని దాదాపు ప్రయత్నిస్తున్నాడని టాక్. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో నాన్ స్టాప్ గా ఒజికి రెండు వారాలు టైం ఇవ్వడమంటే కష్టమనే తోస్తుంది. అయినా మేకర్స్ అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ కాగా, త్వరలోనే ఫస్ట్ లిరికల్ సాంగ్ అప్డేట్ రానుంది. ఆ సాంగ్ దాదాపు పవన్ ఇంట్రో సాంగే అయి ఉంటుందని ట్రేడ్ విశ్లేషకుల అభిప్రాయం. మరి ఎలక్షన్ అయ్యేలోపే పవన్ తో మేకర్స్ డేట్లు అడ్జస్ట్ చేయించుకుంటారా లేదా అనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు