OMG 2: ఓ మై గాడ్ 2 తెలుగు రీమేక్ చెయ్యాల్సిందే.. !

ప్రస్తుతం ఉన్న సమాజంలో కొన్ని కథలు ఖచ్చితంగా వెండి తెర మీద ఆవిష్కరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రేక్షకులకు వాటి మీద అవగాహన ఏర్పడటం తప్పనిసరి. అలాగే అలాంటి ఖచ్చితత్వం ఉన్న సినిమాలు ఎప్పుడోగానీ రావు. అలాంటి కోవకు చెందిన సినిమానే ఇటీవలనే హిందీలో వచ్చిన ఓ మై గాడ్ 2 అని చెప్పవచ్చు.

తర తరాల నుంచి హిందూ మత గ్రంధాలు సెక్స్ సంబంధిత విషయాలను పిల్లలు తెలుసుకోవడం పాపమని ఒక మూఢ నమ్మకాన్ని జనాల్లో ప్రబలింపజేసేలా చేసారు. దాని కారణంగానే ఈరోజుల్లో పిల్లలకు సెక్స్ మీద సరైన అవగాహన లేక.. ప్రేమ , డేటింగ్ ల పేరుతో జీవితాలను పాడు చేసుకుంటారు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటని సుదీర్ఘంగా చర్చించే సినిమానే ఓ మై గాడ్ 2.

అక్షయ్ కుమార్, పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవలనే థియేటర్స్ లో రిలీజై.. మంచి విజయాన్ని సాధించింది. ఇండియాలోని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో సెక్స్ ఎడ్యుకేషన్ ను కూడా ఇంక్లూడ్ చేయాలనే అద్భుతమైన మెసేజ్ ను అందిస్తూ వచ్చిన ఈ సినీమా ఇటీవలనే థియేటర్ రన్ ముగించుకొని కొద్దీ రోజుల క్రితమే ఓటిటి లో కూడా రిలీజ్ అయింది. దాంతో ఈ సినిమా మరింతగా పాపులర్ అయింది.

- Advertisement -

ప్రస్తుతం ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేయడానికి ప్రముఖ బడా నిర్మాతలు ప్రయత్నిస్తురని సమాచారం అందుతోంది. అయితే మరి ఇలాంటి ఒక సెన్సిటివ్ విషయాన్నీ ప్రేక్షకులకు అందించే సినిమాలో హీరోలుగా ఎవరు నటిస్తారనేది తేలకుండా ఉంది. కంటెంట్ పరంగా మంచి సినిమానే అయిన రీమేక్ అనేసరికి అందరిని కలవరనికి గురి చేస్తుందని చెప్పాలి. అయితే ఈ సినిమాను ఏమాత్రం లెట్ చేయకుండా రీమేక్ ద్వారా గాని డబ్బింగ్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు తెలియజేయాలనేది మేధావుల వాదన. మరి ఇది సఫలీకృతం అవుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు