Vishwak Sen: “చిన్నా”ని హిట్ చేయడం కోసం సిద్దూ తిప్పలు?

 

టాలీవుడ్ లో ఒకప్పుడు లవర్ బాయ్ ఇమేజ్ తోనే స్టార్ హీరో రేంజ్ ని మెయింటైన్ చేసిన హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు ఈ హీరో నుండి సినిమా వస్తుందంటే చాలు మూవీ లవర్స్ థియేటర్లకు క్యూ కట్టేవారు. ఇప్పుడంటే నాని, విజయ్ అంటూ హీరోల పేర్లు చెప్తున్నారు గాని, ఒకప్పుడు సిద్ధార్థ్ చూసిన స్టార్ డమ్ కి వీళ్ళు దగ్గరగా కూడా రాలేకపోయారు. అలాంటిది ఒకానొక సమయంలో తమిళ్ సినిమాల మోజులో పడి మంచి మార్కెట్ ఉన్న టాలీవుడ్ ని మిస్ చేసుకున్నాడు సిద్ధార్థ్. అప్పటి నుండే నాని, నిఖిల్, విజయ్ లాంటి హీరోలు స్వింగ్ లోకి వచ్చారు.

అయితే తన తప్పు తెలుసుకున్న సిద్ధూ ఇప్పుడు తెలుగు సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నా, ఎవ్వరూ ఆఫర్లు ఇవ్వడం లేదు. సిద్ధూ హిట్ కొట్టి కూడా చాలా ఏళ్ళు అయింది. ఇక సిద్ధార్థ్ తాజాగా “చిన్నా” అనే ఎమోషనల్ థ్రిల్లర్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 7న రిలీజ్ అయిన చిన్నా ప్రేక్షకుల్లో మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సిద్ధార్థ్ ఒకప్పుడు చేసిన తప్పుల వల్ల ఇంకా తెలుగు ఆడియన్స్ కనికరించలేదు.

- Advertisement -

చిన్నా సినిమాని హిట్ చేయడానికి సిద్ధూ తెలుగులో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. తెలుగు ప్రెస్ మీట్స్ మొదలుకొని, ఇంటర్వ్యూ ల వరకు అన్నీ దగ్గరుండి తానే చూసుకుంటున్నాడు. రీసెంట్ గా స్టార్ మా లో బిగ్ బాస్ షో కి వెళ్లి కూడా తన సినిమాని ప్రమోట్ చేసుకోగా, ఇప్పుడు ఇతర హీరోల సహాయం కూడా కోరుకుంటున్నాడు. లేటెస్ట్ గా విశ్వక్ సేన్ తో కలిసి చిట్ చాట్ చేసాడు సిద్ధార్థ్.

ఈ మధ్య బాగా వైరల్ అయిన ‘ఈటింగ్ చాట్ విత్ టాకింగ్’ ఇంటర్వ్యూ లో విశ్వక్ సేన్, సిద్ధార్థ్ ని ఇంటర్వ్యూ చేస్తున్న స్టిల్స్ బాగా వైరల్ అయ్యాయి. ఈ వీడియో ఇంకా రిలీజ్ కాలేదు. బహుశా రేపు రిలీజ్ చెయ్యొచ్చు. ఏది ఏమైనా సిద్ధార్థ్ తన సినిమాని హిట్ చేయడానికి తెలుగులో ఇంత తిప్పలు పడాల్సి వస్తుందని ఎవ్వరూ అనుకోలేదు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు